- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెదిరింపులకు పాలేరు ప్రజలు భయపడరు : మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి
దిశ, నేలకొండపల్లి : పాలేరు నియోజక ప్రజలు బెదిరింపులకు భయపడరని ప్రేమ పూర్వకంగా అడిగితే ఓట్లేస్తారని

దిశ, నేలకొండపల్లి : పాలేరు నియోజక ప్రజలు బెదిరింపులకు భయపడరని ప్రేమ పూర్వకంగా అడిగితే ఓట్లేస్తారని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ముజ్జుగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంటి పై బూటకపు దాడి, ప్రచారాన్ని ఖండిస్తూ మంగళవారం బీఆర్ఎస్, సీపీఎం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు మూడు రోజుల ముందే మాకు ఇలాంటి సంఘటన జరుగుతుందని తెలుసని, పాలేరు నియోజకవర్గ ప్రజలు బెదిరింపులు సహించారని అన్నారు. ప్రేమ పూర్వకంగా అడిగితేనే ఇక్కడి వాళ్ళు ఓట్లు వేస్తారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మేము ఇంట్లో ఉన్న గెలుస్తామని,ఎక్కడ నుంచో వచ్చి దౌర్జన్యం చేస్తే మేము సహించమన్నారు.మేము కూడా ఇటువంటివి చేయగలుగుతం, కానీ పేద ప్రజలను ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు.పాలేరులో దౌర్జన్యం నడవదని, బెదిరింపులకు వ్యతిరేకంగా ఓటు వేయండనీ,ఈ మేము మీకు అండగా ఉంటామని అన్నారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, సీపీఐ(ఎం) పాలేరు నియోజకవర్గ ఇంచార్జీ బండి రమేష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, సీపీఎం మండల కార్యదర్శి కేవీ రెడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






