- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజకీయాల్లో నిబద్ధతతో పని చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
దిశ, సత్తుపల్లి : రాజకీయాల్లో నిబద్ధతతో నీతి, నిజాయితీతో మంచి పేరుతో పని చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ

దిశ, సత్తుపల్లి : రాజకీయాల్లో నిబద్ధతతో నీతి, నిజాయితీతో మంచి పేరుతో పని చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం సత్తుపల్లి మండలం బేతుపల్లి గంగారం గ్రామంలో నూతనంగా రూ.75 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి రూ. 50 లక్షల వ్యయంతో ప్రకాష్ నగర్ కాలనీ లో అంతర్గత సీసీ డ్రైన్లు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ సత్తుపల్లి కీర్తి ప్రతిష్టలను దేశ నలుమూలల చాటి చెప్పే విధంగా అభివృద్ధిలో జలగం వెంగళరావు తో పోటీపడి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సత్తుపల్లి కి అందించామన్నారు.
సత్తుపల్లి కీర్తి ప్రతిష్టలను ఎన్నడూ దిగజార్చ లేద ని కొందరు తమ రాజకీయ సౌలభ్యం కోసం దిగజారి వ్యవహరిస్తున్నారని పేకాట, కోడిపందాలు ఇసుక,మట్టి మాఫియాలను ప్రోత్సహించి పార్టీకి స్థానిక ప్రజాప్రతినిధులకు చెడ్డ పేరు వచ్చే లాగా వ్యవహరిస్తున్నారని వారి పట్ల, ఎమ్మెల్యే కఠినంగా వ్యవహరించాలని ఆమెను ఆదేశించారు, సత్తుపల్లి కి గోదావరి జలాలు అందించిన ఘనత తమదేనని త్వరలో సంక్రాంతి నాటికి గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రారంభిస్తామని దీంతో సత్తుపల్లి నుంచి ఖమ్మానికి 36 నిమిషాల వ్యవధిలోనే చేరుకోవటం జరుగుతుందని తెలిపారు. గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్న మధుబాబుకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సత్తుపల్లి మండలం గ్రామంలో ఆనాడు దాసరి వీరారెడ్డి 1964 లో స్కూల్ ప్రారంభోత్సవానికి హాజరయ్యానని.. మళ్లీ ఈనాడు గ్రామాభివృద్ధిలో భాగంగా కోట్లాది రూపాయలు వ్యయంతో అనేక కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు బస్ షెల్టర్ నిర్మాణంతోపాటు, ప్రకాష్ నగర్ సీసీ డ్రైన్లు నిర్మాణానికి ఇంటిగ్రేటెడ్ గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి సహకరిస్తున్న మధు మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మధు మోహన్ రెడ్డి మంత్రి తుమ్మలకు గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరగా.. దీనిపై స్పందించిన మంత్రి వెంటనే ప్రభుత్వ అధికారులు స్థలాన్ని పరిశీలించి పేదలకు అందించేందుకు ప్రభుత్వం తరఫున తప్పకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్న మధు మోహన్ రెడ్డి కి గ్రామ ప్రజలందరూ అండగా నిలవాలని గ్రామ ప్రజలందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని గ్రామపంచాయతీ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులు సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా గ్రామ అభివృద్ధికి సహకరిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, ఏసీపీ వసుంధర యాదవ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ దయానంద్ విజయకుమార్, ఎమ్మార్వో సత్యనారాయణ, ఎంపీడీవో ఆర్ నాగేశ్వరరావు, సర్పంచ్ కాకర్ల రేవతి, పాకలగూడెం సర్పంచ్ మందపాటి మౌనిక రెడ్డి, దాసరి చిట్టి నాయన, దాసరి మధు మోహన్ రెడ్డి పాల్గొన్నారు






