క్రీడా మైదానంపై కోటి ఆంక్షలు..!

by velandi.Saikiran |

కొత్తగూడెం, రుద్రంపూర్ ప్రాంతాల్లో ఉన్న క్రీడా మైదానాల్లో స్థానిక యువకులకు ప్రోత్సాహం కరువైంది. ఆటలు ఆడేందుకు అనుమతి

క్రీడా మైదానంపై కోటి ఆంక్షలు..!
X

క్రీడా మైదానంపై కోటి ఆంక్షలు..!

=అనుమతి పేరిట అధికారుల అడ్డగింత

=స్థానిక యువకులకు దక్కని అవకాశం

=క్రీడాకారులను నిరుత్సాహ పరుస్తున్న సింగరేణి

=ఆటలాడేందుకు అనుమతికి ముప్పుతిప్పలు

కొత్తగూడెం, రుద్రంపూర్ ప్రాంతాల్లో ఉన్న క్రీడా మైదానాల్లో స్థానిక యువకులకు ప్రోత్సాహం కరువైంది. ఆటలు ఆడేందుకు అనుమతి పేరిట కోటి ఆంక్షలు పెడుతున్నారు. ముఖ్యంగా రుద్రంపూర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ మైదానంలో ఏదైనా క్రీడ నిర్వహించాలన్నా, ప్రాక్టీస్ చేసుకోవాలన్నా స్థానిక అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల మైదానాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ద్వారా క్రీడలను ప్రోత్సహించేందుకు ఫ్లడ్ లైట్స్, ఆధునిక వసతులు కల్పించారు. రాత్రి వేళలో ఫ్లడ్ లైట్స్ వెలుతురులో క్రీడలు ఆడాలన్నా, ఉదయం, మధ్యాహ్నం వేళల్లోనూ క్రీడలు నిర్వహించుకోవాలన్నా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలంటూ సింగరేణి అధికారుల అనుమతి తీసుకోవాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అనుమతి కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా అనుమతి రాక నిర్వాహకులు అనేక కష్టాలు పడుతున్నారు. క్రీడాకారులకు అనుమతివ్వకపోవడంపై ఔత్సాహికులు నిరుత్సాహానికి గురవుతున్నారు. దిశ ప్రతినిధి, కొత్తగూడెం

దిశ ప్రతినిధి, కొత్తగూడెం : కొత్తగూడెం నియోజకవర్గంలో కేంద్రీకృతమై ఉన్న సింగరేణి సంస్థ క్రీడాకారులను ప్రోత్సహించి వారిని దేశ భవిష్యత్తు కు ఉపయోగపడే క్రీడాకారులను తయారు చేయాల్సిన బాధ్యత ఎంతో కొంత ఉంది. కానీ క్రీడాకారులను ప్రోత్సహించకుండా అడ్డుకట్ట వేస్తోంది. కొత్తగూడెం, రుద్రంపూర్ ప్రాంతాల్లో ఉన్న క్రీడా మైదానాల్లో స్థానిక యువకులకు అవకాశం ఇవ్వకుండా సంబంధిత అధికారులు 'కోటి' ఆంక్షలు పెడుతున్నారు. ముఖ్యంగా రుద్రంపూర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ మైదానంలో ఏదైనా క్రీడ నిర్వహించాలంటే, ప్రాక్టీస్ చేసుకోవాలంటే స్థానిక అధికారుల వేధింపులు ఎక్కువైపోయాయి. అక్కడ స్థానిక యువకులు క్రీడలను ప్రోత్సహించేందుకు ఏదైనా క్రీడా పోటీలు నిర్వహించాలంటే "అనుమతి" అనే నెపంతో సవాలక్ష సవాళ్లు పెడుతూ ఇబ్బందులు సృష్టిస్తున్నారు. దీంతో స్థానిక యువకులు క్రీడా మైదానం లో ప్రాక్టీస్ చేసుకోలేక లేక తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు.

క్రీడాకారుల కృషితో గ్రౌండ్ ఏర్పాటు

దాదాపు 30ఏండ్ల క్రితమే రుద్రంపూర్‌లోని సీనియర్ క్రీడాకారులు, అక్కడి యువత సహకారంతో క్రీడా మైదానాన్ని స్వయంకృషితో మైదానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఉదయం, సాయంత్రం వేళలో అనేక మంది యువకులు ప్రాక్టీస్ చేసి వివిధ పోటీల్లో పాల్గొని రాణించి తమ ప్రతిభ చాటుకున్నారు. ఎంతో మంది యువకులు ఇక్కడ సాధన చేసి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉద్యోగం సైతం సాధించారు. వాటి స్ఫూర్తితోనే అనేక మంది యువకులు ఇక్కడ సాధన చేస్తున్నారు. కానీ ఇటీవల ఆ మైదానాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ద్వారా క్రీడలను ప్రోత్సహించేందుకు అభివృద్ధి పనులు చేపట్టారు. మైదానంలో ఫ్లడ్ లైట్స్, ఆధునిక వసతులు ఏర్పాటు చేసి అభివృద్ధి చేశారు. అయితే రాత్రి వేళలో ఫ్లడ్ లైట్స్ వెలుతురులో క్రీడలు ఆడాలంటే సింగరేణి అధికారుల అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఉదయం, మధ్యాహ్నం వేళలో కూడా స్థానిక యువకులకు క్రీడలు నిర్వహించుకోవాలంటే అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలంటూ సంబంధిత అధికారులు క్రీడాకారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. "చీమలు పెట్టిన పుట్టలో పాములకిరువైనట్లు..!" గా ఉంది కొందరు అధికారుల వ్యవహారం. అసలు ఈ క్రీడా మైదానం సి ఎస్ ఆర్ నిధులతో అభివృద్ధి చేసింది దేనికోసం..? స్థానిక యువకులను ప్రోత్సహించడానికా ? లేక కేవలం సింగరేణి అధికారులు పరపతి ఉన్న వారికే అనుమతులు ఇస్తూ వారిని ఆడించడం కోసమా ? అన్నది ఇక్కడ అర్థం కాని ప్రశ్నగా మారింది. స్థానిక యువకులు ఇక్కడ ఆడాలన్న, పోటీలు నిర్వహించాలన్న అనుమతి కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, అధికారుల అనుమతి రాక అనేక కష్టాలు పడుతున్నారు నిర్వాహకులు.

నిరుత్సాహంలో క్రీడాకారులు

క్రీడాకారులకు అనుమతివ్వకపోవడంపై ఔత్సాహికులు నిరుత్సాహానికి గురవుతున్నారు. గతంలో సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా అంటే గొడవలు, అల్లర్లు, ఇతరత్ర వ్యాపకాలతో కొంతమంది యువకులు కాలక్షేపం చేసి విలువైన జీవితాన్ని కోల్పోయారు. కాలక్రమేణ సమాజంలో యువతలో మార్పు తీసుకురావడానికి స్థానిక సింగరేణి అధికారులు, పోలీసు డిపార్ట్మెంట్, విద్యావంతులు, క్రీడాకారులు యువతలో అవగాహన తీసుకువచ్చి క్రీడల వైపు వారిని మళ్లించారు. దీంతో ప్రస్తుతం రుద్రంపూర్, గౌతంపూర్ ఏరియా లో అనేక మంది యువత క్రీడల వైపు ఆకర్షితులయ్యారు. కానీ ప్రస్తుతం

మత్తు మాదకద్రవ్యాలను నిర్మూలిస్తున్నామని చెప్పే కొందరు అధికారులు సైతం స్థానిక క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించకపోవడంపై స్థానిక ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువతను క్రీడల్లో ప్రోత్సహిస్తే చెడు వ్యసనాలకు దూరమవుతారని చెప్పే అధికారులు ఇలాంటి విషయాల పై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొత్తగూడెం ఏరియాలో గల ప్రొఫెసర్ జయశంకర్ క్రీడ మైదానంలో అధికారులు పగటిపూట విధిస్తున్న ఆంక్షలు ఎత్తివేయాలని క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించాలని స్థానిక యువకులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

పగటి పూట అవకాశం ఇవ్వాలి

గుమ్మడి నిశాంత్

క్రీడలు ఆడుకునేందుకు ఆంక్షలు విధించడం ఎక్కడ లేదు. కానీ మన కొత్తగూడెం , రుద్రంపూర్ స్టేడియంలలో మాత్రం ఆటలు ఆడాలన్నా, పోటీలు నిర్వహించాలన్నా ఆంక్షలు పెడుతూ క్రీడాకారులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. యువతను ప్రోత్సహించాలి. పగటి పూట ఆడేందుకు అనుమతి ఇవ్వాలి. వేరే ప్రాంతం వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ అధికారులతో కలిసి ఆడుకుంటున్నాడు. మేమేం తప్పు చేశాం. మాకెందుకు ఆటలాడేందుకు మాకెందుకు ఈ ఆటంకాలు..

Next Story