ఇటు ఉన్నోడికి రూ.కోటిన్నర

by Disha Web Desk 1 |
ఇటు ఉన్నోడికి రూ.కోటిన్నర
X

మంత్రి పువ్వాడ ఛలోక్తులు

దిశ, వైరా: "వైరా మున్సిపాలిటీ అభివృద్ధికి సీఎం కేసిఆర్ ఇటీవల రూ.30 కోట్లు నిధులు కేటాయించారు. వైరా మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులున్నాయని.. ఒక్కో వార్డుకు రూ.కోటిన్నర చొప్పున నిధులు మంజూరు అవుతాయి. ఇటు ఉన్నోడికి కోటిన్నర నిధులు" అంటూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఛలోక్తులు విసిరారు. వైరాలోని వాసవి కల్యాణ మండపంలో మంగళవారం వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రసంగించే ముందు ఎమ్మెల్యే రాములు నాయక్ స్థానిక సమస్యలను మంత్రికి వివరించేందుకు ప్రయత్నించారు. వైరా మున్సిపాలిటీ సమస్యల గురించి ఎమ్మెల్యే ప్రస్తావిస్తుండగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అడ్డుకొని వైరా మున్సిపాలిటీ కు ఇటీవల కేసీఆర్ రూ.30 కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా ఒక్కో వార్డుకు రూ.కొట్టిన్నర చొప్పున నిధులు కేటాయిస్తామన్నారు. ఈ సమావేశానికి ఎంతమంది కౌన్సిలర్లు హాజరయ్యారని మంత్రి ఎమ్మెల్యే ను ప్రశ్నించారు. 20 మందికి గాను 17 మంది కౌన్సిలర్లు సమావేశానికి హాజరయ్యారని ఎమ్మెల్యే వివరించారు. సమావేశానికి వచ్చిన కౌన్సిలర్లను ఉద్దేశించి మంత్రి పువ్వాడ మాట్లాడారు. ఇటువైపు ఉన్న ప్రతి కౌన్సిలర్ కు రూ.కోటిన్నర రూపాయల నిధులతో పనులు చేసే అవకాశం కల్పిస్తామనే అర్థం వచ్చే విధంగా ఇటు ఉన్నోడికి రూ.కోటిన్నర అంటూ మంత్రి ఛలోక్తులు విసిరారు. అంతే కాకుండా ఈ సమావేశానికి వచ్చిన మీడియా ప్రతినిధులు పై కూడా జోకులు వేశారు. తాను ఖమ్మంలో మీడియా సమావేశం పెట్టినా ఇంతమంది మీడియా ప్రతినిధులు హాజరు కారు... ఇక్కడికి బ్యూరోలు కూడా వచ్చారు. ప్రస్తుతం నడుస్తున్న అంశంపై ఉచ్చుకత, వేడి ఎంత ఉందో మీడియా ప్రతినిధులను చూస్తేనే అర్థం అవుతోందన్నారు మాట్లాడారు. ఈ సమావేశంలో వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, సుడా చైర్మన్ బచ్చు రమణ, వైరా నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు



Next Story

Most Viewed