నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి : ఎస్సై విజయసింహారెడ్డి

by Ratna Kumari |

దిశ, అన్నపురెడ్డిపల్లి : నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్సై విజయసింహారెడ్డి తెలిపారు.

నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి : ఎస్సై విజయసింహారెడ్డి
X

దిశ, అన్నపురెడ్డిపల్లి : నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్సై విజయసింహారెడ్డి తెలిపారు. తాజాగా ఆయ‌న దిశ‌తో మాట్లాడారు. అన్నపురెడ్డిపల్లి మండల ప్రజలకు అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ ఇబ్బంది తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలు ఎవరికి ఇబ్బందులు కలిగించేలా లేదా కించపరిచేలా ఉండకూడ‌ద‌ని విజయసింహారెడ్డి తెలిపారు. నూతన సంవత్సర వేడుకలపేరుతో రహదారులపక్కన వ్యవసాయ పొలాల్లో మద్యం సేవించి గాజు సీసాలను పగలగొట్టిన వాహనాలు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయకూడదని సూచించారు. ఒక‌వేళ‌ ఇటువంటి చర్యలు పోలీసుల దృష్టికి వెళ్తే తప్పనిసరిగా కేసులు నమోదు చేస్తారని హెచ్చరించారు. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్, సైలెన్సర్ ద్వారా అధిక శబ్దాలు చేసి ప్రజలనుఇబ్బందులకు గురిచేసిన మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించకూడదని, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దని స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నపరెడ్డి పల్లి ప్రజలను ఎస్సై విజయసింహారెడ్డి కోరారు.

Next Story