- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యూఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి : ఎస్ఐ నాగరాజు
దిశ, కూసుమంచి : నూతన సంవత్సర వేడుకలను మండల ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలనిఎస్ఐ నాగరాజు సూచించారు.

దిశ, కూసుమంచి : నూతన సంవత్సర వేడుకలను మండల ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలనిఎస్ఐ నాగరాజు సూచించారు. వేడుకలను నిర్వహించుకునేవారు జాగ్రత్తలు పాటించాలని, ప్రమాదాలకు దూరంగా ఉంటూ పిల్లలు, పెద్దలు అందరూ వారి ఇళ్లలో ఉత్సవాలు జరుపు కోవాలని సూచించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగ కుండా పోలీస్ శాఖ తరపున పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని తెలిపారు. అలాగే ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహిస్తే వారిపై తగు చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. డిసెంబర్ 31 అనేది ప్రతి సంవత్సరం వస్తుంది. కానీ జీవితం కోల్పోతే మళ్ళీ రాదు. ఈ విషయాన్ని అందరూ గమనిం చగలరు. ముఖ్యంగా యువత ఒక్క రోజు ఆనందం గురించి జీవితాన్నిపణంగా పెట్టకండి. త్రాగిన మత్తులో ఎవరు ఇతరులతో అమర్యాదగా ప్రవర్తించాకూడదు. మద్యం మత్తులో వాహనాలు నడపడం నేరం, మైనర్లు వాహనాలు నడపరాదు. టపాసులు, డీజేలు నిషేధం, రహదారులు బ్లాక్ చేసి వేడుకలు చేస్తే కఠిన చర్యలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ఇతరులను ఇబ్బందులు పెడితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం దుకాణాలను నిర్ణీత సమయంలో మూసివేయాలని ఆదేశించారు.






