నేడు కొలువుదీరనున్న కొత్త సర్పంచులు

by Malleboina Mahesh |

ఖమ్మం జిల్లాలో సుమారు రెండేళ్ల తర్వాత గ్రామపంచాయతీలో పాలకవర్గాలు కొలువు తీరనున్నాయి.

నేడు కొలువుదీరనున్న కొత్త సర్పంచులు
X

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెండేళ్ల తర్వాత పంచాయతీలకు నూతన కల సంతరించుకోనున్నది. 2019లో పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించగా, 2024లో సర్పంచుల పదవీకాలం పూర్తయింది. అనంతరం గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల పాలన లోకి తెచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించింది. ఖమ్మం జిల్లాలో మొత్తం జిల్లాలో 571 పంచాయతీలు ఉండగా హైకోర్టు తీర్పుతో ఐదు పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. ఒక పంచాయతీలో సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు కాలేదు. మిగిలిన 565 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 471 గ్రామాలు ఉండగా పాల్వంచ మండలంలో పాండురంగ పురం, ములకలపల్లి లోని చాపరాల పల్లి, జూలూరుపాడులోని జూలూరుపాడు గ్రామాలకు కోర్టులో స్థానికులు కేసు వేయడంతో ఎన్నికలు నిలిచిపోయాయి. మిగిలిన 468 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. - దిశ, ఖమ్మం కార్పొరేషన్/ కొత్తగూడెం ప్రతినిధి

దిశ, ఖమ్మం కార్పొరేషన్/ కొత్తగూడెం ప్రతినిధి : ఖమ్మం జిల్లాలో సుమారు రెండేళ్ల తర్వాత గ్రామపంచాయతీలో పాలకవర్గాలు కొలువు తీరనున్నాయి. 2019లో పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించగా, 2024 లో సర్పంచుల పదవీకాలం పూర్తయింది. అనంతరం గ్రామపంచాయతీలకు ఎన్నికల నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల పాలనలోకి తెచ్చారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడంతో సుమారు రెండేళ్ల తర్వాత గ్రామపంచాయతీలో స్వపరిపాలన నెలకొననుంది. ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు సోమవారం ప్రమాణస్వీకారం చేయనుండటంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది ప్రమాణ స్వీకార ఉత్సవాలకు గ్రామపంచాయతీలు ముస్తాబయ్యాయి.

కాంగ్రెసులో విజయోత్సాహం..

జిల్లాలో 571 పంచాయతీలు ఉండగా హైకోర్టు తీర్పుతో ఐదు పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోయాయి ఒక పంచాయతీలో సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు కాలేదు. మిగిలిన 565 పంచాయతీలలో 65 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఈనెల 11, 14, 17 వ తేదీల్లో ఖమ్మం జిల్లాలోని 20 మండలాల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఏకగ్రీవ స్థానాలతో కలిసి 381 సర్పంచ్ స్థానాలు దక్కించుకోగా బీఆర్ఎస్ 118, సీపీఎం 26 , సీపీఐ 11, ఇతరులు 24, టీడీపీ స్థానాలు దక్కించుకున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ ఉనికిని కాపాడుకున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ ఐదు స్థానాల్లో ఖాతా తెరిచింది.

నేడు సర్పంచుల ప్రమాణ స్వీకారం

సోమవారం జిల్లాలో గెలిచిన సర్పంచులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన 381 మంది, బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన 118 మంది, సిపిఎం మద్దతు ఇచ్చిన 26 మంది, సిపిఐ మద్దతిచ్చిన 11 మంది. టిడిపి మద్దతిచ్చిన 5గురు ఇతరులు 24 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు

భద్రాద్రి జిల్లాలో 468సర్పంచ్‌లు

రెండేళ్ల తర్వాత కొత్త పంచాయతీలకు కల వచ్చింది. ఇటీవల గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణ పూర్తి కావడంతో సోమవారం నూతన సర్పంచులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మొత్తం జిల్లాలో 471 గ్రామాలు ఉండగా 468 పంచాయతీలకు ఎన్నికలు పూర్తయ్యాయి. జిల్లాలోని పాల్వంచ మండలంలో పాండురంగ పురం, ములకలపల్లి లోని చాపరాల పల్లి, జూలూరుపాడు లోని జూలూరుపాడు గ్రామం లో కోర్టు లో స్థానికులు కేసు వేయడం తో సాంకేతిక కారణాలతో నిలిచిపోయాయి. ఇక మిగిలిన 468 పంచాయతీలకు ఆయా గ్రామ సర్పంచులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే జిల్లాలో కాంగ్రెస్ 254 స్థానాలు, బీఆర్ఎస్ 85, సీపీఐ 37, సీపీఎం 12, తెలుగుదేశం 2, న్యూడెమోక్రసీ 2, సీపీఐ ఎంఎల్ ప్రజా పంథా మాస్‌లైన్ 8, మిగిలిన ఇతర సర్పంచులు ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు.

Next Story