- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి జనరల్ స్థానంలో ఎమ్మార్పీఎస్ పోటీ
ఏన్కూరు మండలంలోని ప్రతి జనరల్ స్థానంలో ఎమ్మార్పీఎస్ పోటీ చేస్తుందని ఎమ్మార్పీఎస్

దిశ, ఏన్కూరు: ఏన్కూరు మండలంలోని ప్రతి జనరల్ స్థానంలో ఎమ్మార్పీఎస్ పోటీ చేస్తుందని ఎమ్మార్పీఎస్ ,మండల అధ్యక్షుడు యంగళ నరేష్ మాదిగ ప్రకటించారు. మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ ఏజెన్సీ మండలంలోని స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వేషలను ఏన్కూరు మండల ఎమ్మార్పీఎస్ వ్యతిరేకిస్తుంది అన్నారు. ఏజెన్సీలో నివసిస్తున్న ఎస్టీ సామాజిక వర్గానికి వారి రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు. కానీ ఏన్కూరు మండల వ్యాప్తంగా సుమారు 6000 పైన sc ఓటర్లు ఉన్నారని గుర్తించకపోవడం దారుణం అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎస్సీ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గాలను గుర్తించవలసిందిగా కోరుతున్నామని తెలిపారు.
జనరల్ స్థానాలు కేటాయించడం వలన ఆర్థికంగా ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం స్థానిక ఎమ్మార్వో గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పూర్ణకంటి మైసరావు మాదిగ,msp మండల అధ్యక్షుడు దామెర్ల వీరయ్య మాదిగ, పూర్ణ కంటి నాగరాజు మాదిగ, ఎక్కిరాల కృష్ణ మాదిగ, జెర్రిపోతుల నరేష్, మంగళ పూడి రాజ్ కుమార్, మారుబత్తుల రాకేష్,కాంపల్లి నాగరాజు, మోదుగు శివ, చిలుకూరి అను, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.






