ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ ఎంపీవో, కార్యదర్శి

by Nagam Mallesh |

ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ ఎంపీవో, కార్యదర్శి
X

దిశ, గుండాలః భద్రాది కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి ఎంపీడీవో ఆఫీసులో ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. మర్కోడు మాజీ ఉపసర్పంచ్ దగ్గర నుండి కాంట్రాక్ట్ బిల్లు కోసం 15000 డిమాండ్ చేయగా ఉప సర్పంచ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అయితే ఆళ్లపెళ్లి ఎంపీవో శ్రీనివాసరావు, మర్కోడు పంచాయతీ సెక్రెటరీ నాగరాజు కలిసి ఉపసర్పంచ్ నుంచి లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆళ్లపల్లి మండలంలో ఈ సంఘటన సంచలనం రేపుతోంది.

Next Story