అసెంబ్లీ గేట్ నీ అబ్బ సొత్తు కాదు : ఎంపీ రవిచంద్ర

by Disha Web Desk 20 |
అసెంబ్లీ గేట్ నీ అబ్బ సొత్తు కాదు : ఎంపీ రవిచంద్ర
X

దిశ, సత్తుపల్లి : బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఫైర్ అయ్యారు. సత్తుపల్లి పట్టణ బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ గేట్ నీ అబ్బ సొత్తు కాదు.. బరాబర్ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెడతారు. నీకో రాజకీయ జెండా లేదు.. ఎజెండా లేదు.. అమాయకులైన నలుగురు నాయకులను వెంటేసుకుని తిరుగుతున్నావు అంటూ ఫైర్ అయ్యారు. వాళ్లను రాజకీయంగా అన్యాయం చేయడం తప్ప ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు.

కేసీఆర్, కేటీఆర్ ఇచ్చిన అవకాశాన్ని రాజకీయంగా దుర్వినియోగం చేసుకున్నావని. అదే క్రమంలో ఆర్ధికంగా లాభపడ్డావు. అసెంబ్లీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ లు ఇచ్చిన వారిని ఓడించడానికి కుయుక్తులు పన్నావు. అయినా కేసీఆర్ ఓపికతో ఎదురు చూశారు. కానీ నీలో మార్పు రాలేదు. ఇటుక, ఇటుక పేర్చి కేసీఆర్ ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని శక్తి వంతంగా చేశారు. ఈ పార్టీని ఓడించడం ఎవరి తరం కాదని పొంగులేటి పై ఎంపీ రవిచంద్ర మండిపడ్డారు.

Next Story

Most Viewed