జిల్లా దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే సండ్ర..

by Sumithra |
జిల్లా దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే సండ్ర..
X

దిశ, సత్తుపల్లి : ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్సవాల సన్నాహక సమావేశంలో జిల్లా అధికారులను, ప్రజాప్రతినిధులకు మంత్రి పువ్వాడ పలుసూచనలు చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ఆయాఉత్సవాలు అట్టహాసంగా నిర్వహించాలని ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలిసేలా నిర్వహించాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర రావు, అదనపు కలెక్టర్ స్నేహాలత, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్, మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, సుడా చైర్మన్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed