Big Breaking: భారీ ఆధిక్యంలో నారా లోకేశ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-06-04 04:36:54  IST  )

పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు..

Nara Lokesh
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్‌, ఈవీఎం ఓట్లలో ఆయన 8 వేల ఓట్లకు పైగా ముందజలో ఉన్నారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంగళగిరి నుంచి ఆయన పోటీ చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఓటమి చెందారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సరే సత్తా చాటాలని లోకేశ్ ప్రయత్నం చేశారు. ఆరా మస్తన్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్‌లో మంగళగిరిలో లోకేశ్ భారీ మెజార్టీతో గెలుస్తారని స్పష్టమైంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్‌లో లోకేశ్ ఆధిక్యం సాధించారు. ఏవీఎం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే లీడ్‌లో ఉన్న లోకేశ్ భారీ మెజార్టీ సాధిస్తారేమో చూడాలి.

Next Story