MLA Matta Ragamai Dayanand : వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి

by Chintha Aamani |

గత వారం రోజులుగా సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా విస్తారంగా

MLA Matta Ragamai Dayanand : వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి
X

దిశ,సత్తుపల్లి: గత వారం రోజులుగా సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు చెరువులు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం ప్రమాదాలు చోటు చేసుకోకుండా ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్ కోరారు. సత్తుపల్లి మండల పరిధిలోని బేతుపల్లి 17 అడుగుల నీటిమట్టం చేరుకోవడంతో బేతుపల్లి కాలువ ద్వారా వేంసూరు మండలానికి నీటిని విడుదల చేశారు.

బేతపల్లి చెరువు 17 అడుగుల నీటిమట్టం చేరుకోవడంతో శుక్రవారం నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ బేతుపల్లి చెరువును పరిశీలించి పలు సూచనలు సలహాలు చేశారు. అధికారులు నిరంతర పర్యవేక్షణ చేసి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని, తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ శ్రీనివాసరెడ్డి, డి ఈ వెంకటేశ్వరరావు, ఏఈ, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.

Next Story