- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రులు ఈ రోడ్డు గురించి పట్టించుకోరు..?
రెండు జిల్లాలను కలిపే అంతర్ జిల్లా రహదారి.. నిత్యం వందలాదిగా వివిధ రకాల వాహనాలు తిరిగే రోడ్డుపై ప్రయాణం వాహనదారుల ప్రాణాల మీదకు తెస్తుంది.

దిశ,కొణిజర్ల : రెండు జిల్లాలను కలిపే అంతర్ జిల్లా రహదారి.. నిత్యం వందలాదిగా వివిధ రకాల వాహనాలు తిరిగే రోడ్డుపై ప్రయాణం వాహనదారుల ప్రాణాల మీదకు తెస్తుంది. పల్లిపాడు నుంచి ఏనుకూరుకు 19 కిలోమీటర్ల దూరం ఉంది. రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో అనేక మంది వాహన చోదకులు క్షతగాత్రులు అవుతున్నారు. గత మూడు ఏళ్లుగా రహదారిపై గుంతలు ఏర్పడి ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఇటీవల గత ఐదు రోజుల క్రితం లాలాపురం గ్రామం వద్ద పల్లిపాడు వైపు వెళ్తున్న ట్రాక్టర్ గుంతను తప్పించబోయి పల్లిపాడు నుంచి తీగల బంజర వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో వాహనదారుడి కాలు పాదం నుజ్జు నుజ్జు కావడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇలా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న పట్టించుకునే నాథుడే లేడు. జిల్లాలో ఉన్న ముగ్గురు రాష్ట్ర మంత్రులు అనేక సందర్భాల్లో ఈ రోడ్డు గుండానే ప్రయాణించారు. అయినా ఈ రహదారికి మోక్షం కలగకపోవడం విశేషం. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే తో పాటు మంత్రుల స్పందించి రహదారిని అభివృద్ధి చేయాలని ప్రజల కోరుతున్నారు.






