మురికి కాల్వల సమస్యలకు శాశ్వత పరిష్కారం

by velandi.Saikiran |

ఖమ్మం నగరంలో మురికి కాల్వల సమస్యలకు శాశ్వత పరిష్కారం కొరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

మురికి కాల్వల సమస్యలకు శాశ్వత పరిష్కారం
X

దిశ, ఖమ్మం కార్పొరేషన్: ఖమ్మం నగరంలో మురికి కాల్వల సమస్యలకు శాశ్వత పరిష్కారం కొరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం 21 వ డివిజన్ లో రూ. 545.60 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖమ్మం నగరంలో మురికి కాల్వల సమస్యలకు శాశ్వత పరిష్కారం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణానికి రూ. 1250 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేపడతామని మంత్రి తెలిపారు. ఖమ్మం నగరంలో తాగునీటి సమస్య లేకుండా మరో 250 కోట్లతో తాగునీటి పథకం పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. నగరంలో అన్ని మౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రణాళికాబద్ద చర్యలు చెప్పట్టిందని అన్నారు. ఖమ్మం నగరం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండేలా పౌర సహకారంతో అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.

నగరం పచ్చదనంతో, పరిశుభ్రంగా ఉండేలా ప్రతిఒక్కరు తమ వంతు బాధ్యత నెరవేర్చాలన్నారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story