- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాడార్ చక్రబంధంలో మావోయిస్టు ‘హిడ్మా’.. స్పెషల్ ఫోర్స్‌తో వేట
మావోయిస్టు అగ్రనేత, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీ, అనేక మంది భద్రతా బలగాలను సంహారించడంలో కీలక భూమిక పోషిస్తున్న హిడ్మా బలగాలకు దొరికినట్లే దొరికి తప్పించుకుంటున్నాడు

దిశ, భద్రాచలం: మావోయిస్టు అగ్రనేత, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీ, అనేక మంది భద్రతా బలగాలను సంహారించడంలో కీలక భూమిక పోషిస్తున్న హిడ్మా బలగాలకు దొరికినట్లే దొరికి తప్పించుకుంటున్నాడు. ‘ఆపరేషన్ కగార్’ ప్రారంభం నుంచి హిడ్మా కోసం బలగాలు వేట సాగిస్తూనే ఉన్నాయి. అనేక ఎన్కౌంటర్లలో ఎందరో మావోయిస్టు అగ్రనేతలు బలగాలకు చిక్కిన.. హిడ్మా మాత్రం తప్పించుకుంటూనే ఉన్నాడు. అయితే బస్తర్ ఐజీ సుందర రాజ్ తాజాగా మీడియాకు అందించిన సమాచారం సంచలనంగా మారింది.
మావోయిస్టు హిడ్మా బలగాలకు సంబంధించిన రాడార్ పరిధిలోనే సంచరిస్తున్నాడని, త్వరలో మట్టు పెడతామని ఐజీ పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హిడ్మా ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నాడని, తమకు కావాల్సిన సమాచారం సేకరించాక ఎన్కౌంటర్ చేస్తారని కొందరు భావిస్తున్నారు. ఐజీ అంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నారంటే.. రెండు, మూడు రోజుల్లో ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. హిడ్మా కోసం స్పెషల్ ఫోర్స్ ను నియమించి వేటాడుతున్నామని ఐజీ పేర్కొన్నారు.






