Farmers Association : ప్రతి రైతుకు తిరిగి రుణాలు ఇవ్వాలి

by Sridhar Babu |
Farmers Association : ప్రతి రైతుకు  తిరిగి  రుణాలు ఇవ్వాలి
X

దిశ, వైరా : రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ పథకంలో బ్యాంకు రుణం రద్దయిన ప్రతి రైతుకు తిరిగి రుణాలు ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. రుణాలు రద్దయిన రైతులకు బ్యాంకులు తిరిగి ఇవ్వకుండా అనేక నిబంధనలు పెట్టడం వల్ల రైతులు తిరిగి రుణాలు పొందలేకపోతున్నారని అన్నారు. నో డ్యూ పేరుతో కొన్ని రోజులు, ఈసీ పేరుతో మరల సొసైటీ లు రైతులకు రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు వ్యవసాయ అవసరాలకు ప్రైవేటు వడ్డీ వ్యాపారాల పై ఆధారపడుతున్నారని చెప్పారు.

మొదటి, రెండవ విడతల రుణమాఫీ జాబితాలో 30-40 శాతం రైతులు పేర్లు మిస్ కావడంతో బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులో రుణం ఉన్న ప్రతి రైతు రుణం మాఫీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు తెలంగాణ రైతు సంఘం నాయకులు పైడిపల్లి సాంబశివరావు, గొల్లపూడి ప్రకాశరావు, కురుగుంట్ల శ్రీనివాసరావు, మాడపాటి మల్లిఖార్జున్, వెంకట్, రేమల్ల నారాయణ, బాణాల కృష్ణమాచారి ,ఎస్కే మౌలాలి, సంక్రాంతి పుల్లయ్య , వడ్లమూడి మధు యనమద్ది రామకృష్ణ, సీఐటీయూ జిల్లా నాయకులు సుంకర సుధాకర్, తోట నాగేశ్వరరావు, తోట ఉసేన్, పాసంగులపాటి చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed