ప్రారంభమైన కోటి తలంబ్రాల జప యజ్ఞం

by Taduka Kalyani |

ఒడ్లు వలుపు రాముని పిలుపుతో నిర్వహిస్తున్న 16వ కోటి తలంబ్రాల జప యజ్ఞం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమైంది.

ప్రారంభమైన  కోటి తలంబ్రాల జప యజ్ఞం
X

దిశ, భద్రాచలం : ఒడ్లు వలుపు రాముని పిలుపుతో నిర్వహిస్తున్న 16వ కోటి తలంబ్రాల జప యజ్ఞం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమైంది. భక్తులు ప్రత్యేక పూజలు, శ్రీరామ నామస్మరణ, కోటి తలంబ్రాల సమర్పణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యజ్ఞానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను, కార్యక్రమ వివరాలను భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం టెంపుల్ ఇన్‌స్పెక్టర్ సాయిబాబాకి నిర్వాహకులు మర్యాదపూర్వకంగా అందజేశారు. యజ్ఞ కార్యక్రమం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షిస్తూ నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కృష్ణ చైతన్య , భక్తులు, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Next Story