- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గౌడన్నలకు కాటమయ్య రక్ష కిట్లు
గౌడన్నలకు ప్రమాదాలు జరుగకుండా ఉండటానికి కాటమయ్య రక్షక కిట్లను తప్పనిసరిగా వినియోగించాలని పొంగులేటి శ్రీనివాస రెడ్డి

దిశ, కూసుమంచి: గౌడన్నలకు గుడ్ న్యూస్. గౌడన్నలకు ప్రమాదాలు జరుగకుండా ఉండటానికి కాటమయ్య రక్షక కిట్లను తప్పనిసరిగా వినియోగించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శుక్రవారం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి 80 మంది లబ్ధిదారులకు కాటమయ్య కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లుగీత కార్మికులకు పూర్తి స్థాయిలో కాటమయ్య రక్షక కిట్లను అందించే దిశగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా కుల వృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో కాటమయ్య రక్షక కిట్ల పంపిణీ కార్యక్రమాలు చేపట్టామని అన్నారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం వంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు భరోసా కల్పించామని చెప్పారు. రుణమాఫీ, 9 రోజులలో 9 వేల కోట్ల రైతు భరోసా నిధులు జమ, క్వింటా సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ వంటి కార్యక్రమాలను అమలు చేశామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ ద్వారా పేదలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని గుర్తు చేసారు. మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ,80 మంది గౌడ సోదరులకు కాటమయ్య రక్షక కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి, కూసుమంచి మండల తహసీల్దార్ రవి కుమార్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






