- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిజిటల్ విధానంలో కొనుగోలు కోసమే 'కపాస్ కిసాన్' యాప్
మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో శనివారం కపాస్ కిసాన్ యాప్ వినియోగంపై సమగ్ర

దిశ, కొత్తగూడెం: మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో శనివారం కపాస్ కిసాన్ యాప్ వినియోగంపై సమగ్ర శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ప్రాంతీయ మార్కెటింగ్ ఉప సంచాలకురాలు వి. పద్మావతి, సిపిఓ సంజీవరావు, జిల్లా మార్కెటింగ్ అధికారి నరేందర్ , వ్యవసాయ అధికారి బాబురావు తో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... కపాస్ కిసాన్ యాప్ రైతులకు ఒక సమగ్ర సమాచార వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ యాప్ ద్వారా రైతులు తమ పత్తి అమ్మకాల వివరాలు, రోజువారీ మార్కెట్ ధరలు, పంట తూకం వివరాలు, చెల్లింపు సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చని తెలిపారు. యాప్ ద్వారా పత్తి కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పెరిగి, రైతులకు సమయానికి న్యాయమైన ధర అందేలా చర్యలు చేపట్టినట్లు ఆమె వివరించారు. జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు మాట్లాడుతూ... డిజిటల్ టెక్నాలజీ వినియోగం ద్వారా రైతులు మధ్యవర్తుల దుర్వినియోగం నుండి రక్షించబడతారని, మార్కెట్ లావాదేవీలపై స్పష్టమైన సమాచారం అందుకోవచ్చని అన్నారు.






