వడ్డీకి వడ్డీ.. మణుగూరులో అధికార పార్టీ నాయకుడి దందా

by I. Sairam |

మణుగూరులో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు వడ్డీ వ్యాపారి అవతారమెత్తి పేదలకు అప్పులు ఇస్తూ... వడ్డీపై వడ్డీ వసూలు చేస్తూ ప్రజల రక్తాన్ని జలగలా పీల్చుతున్నాడు.

వడ్డీకి వడ్డీ.. మణుగూరులో అధికార పార్టీ నాయకుడి దందా
X

మణుగూరులో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు వడ్డీ వ్యాపారి అవతారమెత్తి పేదలకు అప్పులు ఇస్తూ... వడ్డీపై వడ్డీ వసూలు చేస్తూ ప్రజల రక్తాన్ని జలగలా పీల్చుతున్నాడు. గతంలో పది రూపాయల వడ్డీ తీసుకుంటే ఇప్పుడు ఏకంగా రూ.12 పైగా వసూలు చేస్తున్నారు. దీంతో వడ్డీలు కట్టలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. అతడి వద్ద అప్పు తీసుకున్నవారు ఎప్పుడు ఏమంటాడో ఎక్కడ పరువు తీస్తాడోనని ఆందోళన చెందుతున్నారు. వడ్డీలు కట్టలేక, తమ బాధను ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. ఖాళీ చెక్కులు, ప్రాంసరి నోట్లు అతడి వద్దే ఉంచుకుని అడిగినంత వడ్డీ ఇవ్వకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అధికార పార్టీకి చెందిన నాయకుడు కావడంతో అతడిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సహసం చేయలేకపోతున్నట్లు తెలుస్తున్నది. దీంతో పేదల నుంచి వడ్డీకి వడ్డీ వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు.

దిశ, మణుగూరు: మణుగూరులో అధిక వడ్డీ వ్యాపారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తన వడ్డీ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నాడు. గతంలో పది రూపాయల వడ్డీ తీసుకునే వ్యాపారులు ఇప్పుడు ఏకంగా 12 రూపాయల పై పడే వసూలు చేస్తున్నారు. దీంతో వడ్డీలు కట్టలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. అధిక వడ్డీలతో వ్యాపారులు సామాన్యుల నడ్డి విరిస్తున్నారు.

మణుగూరులో వడ్డీ వ్యాపారంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి హవా కొనసాగుతోంది. వడ్డీకి వడ్డీ భూ చక్ర వడ్డీలు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. నిరుపేదల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడు. అధికార పార్టీకి చెందిన నాయకుడు కావడంతో అతనిపై ఎలాంటి చర్యలు లేవని ఆరోపణలు ఉన్నాయి. అతను అప్పు వసూలు చేస్తున్న తీరుతో అప్పు తీసుకున్నవారు వారు నివసించే ప్రదేశంలో తలెత్తుకొని తిరగలేకపోతున్నారు. ఎమ్ టీ చెక్కులు, ప్రాంసరి నోట్లు ఆయన దగ్గర ఉంచుకుని అడిగినంత వడ్డీ ఇవ్వకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నాడు. వడ్డీలకు డబ్బులు తీసుకున్నవారు భయంతో వణికి పోతున్నారు. ఎప్పుడు ఏమంటాడో ఎక్కడ పరువు తీస్తాడో అని కుమిలిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేలుకొని అధిక వడ్డీలు వసూలు చేసే అతనిపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

బాధితుల లబోదిబో..

అధికార పార్టీ నాయకుడి వద్ద అప్పు తీసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. వడ్డీలు కట్టలేక నరకయాతన పడుతున్నారు. తమ బాధను ఎవరికి చెప్పుకోలేక కుమిలి పోతున్నారు. అప్పు తీసుకున్న దానికంటే రెండింతలు వడ్డీలు చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story