- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > ఖమ్మం > వర్షాల దృష్ట్యా ఒంటిపూట బడి.. పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కలెక్టర్ ఆదేశాలు
వర్షాల దృష్ట్యా ఒంటిపూట బడి.. పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కలెక్టర్ ఆదేశాలు
పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కలెక్టర్ ఆదేశాలు

X
దిశ, కొత్తగూడెం : గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు ఒక పూట బడి నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ బుధవారం అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు,ఎయిడెడ్, పాఠశాలల యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు బుధవారం మధ్యాహ్నం నుంచి పాఠశాలలకు సెలవు ప్రకటించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర చారి తెలిపారు. అన్ని మండలాల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వారి పరిధిలోని పాఠశాలలకు ఒక పూట బడి నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు .
- Tags
- khammam
Next Story






