- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర్నలిస్టులపై అక్రమ కేసులను ఎత్తివేయాలి : వనమా రాఘవ
క్షేత్రస్థాయిలో యూరియాపై రైతుల అభిప్రాయాలను నిక్కచ్చిగా తెలియజేసినందుకు జర్నలిస్టులపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్ రావు డిమాండ్ చేశారు.

జర్నలిస్టులపై అక్రమ కేసులను ఎత్తివేయాలి : వనమా రాఘవ
- అక్రమ కేసులకు నిరసనగా జిల్లా జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి
- మద్దతు తెలిపిన భారత్ రాష్ట్ర సమితి
దిశ, కొత్తగూడెం: క్షేత్రస్థాయిలో యూరియాపై రైతుల అభిప్రాయాలను నిక్కచ్చిగా తెలియజేసినందుకు జర్నలిస్టులపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులపై అక్రమ కేసులకు నిరసనగా జిల్లా జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడికి ఆయన మద్ధతు తెలిపారు. టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా స్టాఫర్ సాంబశివరావు, నాగరాజుపై అక్రమ కేసులు వెంటనే తొలగించాలని లేకుంటే పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు కల్లోజు శ్రీనివాస్, జర్నలిస్ట్ యూనియన్ నాయకులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు డిష్ నాయుడు, దాసరి నాగేశ్వరరావు, సమ్మయ్య గౌడ్, వీరన్న, నవభారత్ ఆనంద్, అక్బర్ గాంధీ, ఆర్కె, తెలంగాణ సురేష్, బట్టు మంజుల, పత్తిపాటి శీను, ఆర్ వి రమణ, దాబా శంకర్, రాంబాబు, నరకట్ల రాజశేఖర్, బీఆర్ఎస్వీ టౌన్ అధ్యక్షులు దుర్గాప్రసాద్, జగ్గు తండా సేవియా, బొమ్మిడి రమాకాంత్, అచ్చ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.






