గుండెపోటుతో ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి నాయక్ మృతి

by Kodari Anjali |

గుండెపోటుతో ఇల్లెందుకు చెందిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్వకేట్ రవి నాయక్ మృతి చెందాడు.

గుండెపోటుతో ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి నాయక్ మృతి
X

దిశ, ఇల్లెందు: గుండెపోటుతో ఇల్లెందుకు చెందిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్వకేట్ రవి నాయక్ మృతి చెందాడు. బుధవారం ఉదయం గుండెలో నొప్పి రావడంతో వైద్యశాలకు తరలించి వైద్యం అందిస్తున్న సమయంలో గుండె నొప్పి తీవ్రమై మృతి చెందాడు. అడ్వకేట్‌గా అందరికీ సుపరిచితమైన రవి నాయక్ మృతి పట్ల బార్ అసోసియేషన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఇటీవల జరిగిన ఇల్లందు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో సైతం రవి అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసింది. నిరుపేద కుటుంబంలో జన్మించిన రవి చిన్నప్పటినుంచి కష్టపడి లా పూర్తి చేసి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే సమయంలో మృతి చెందడం బాధాకరమని సీనియర్ న్యాయవాదులు తెలిపారు.

Next Story