ఉత్తగడ్డికి నిప్పు పెడితే.. పంట పొలం కాలింది..!

by Nallavelli.Anjaneyulu |

దిశ, తల్లాడ : ఉత్తగడ్డికి నిప్పు పెడితే పంట పొలం కాలిన ఘటన శనివారం తల్లాడ మండలంలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం కొత్త వెంకటగిరి గ్రామానికి చెందిన మల్లెల గోపాలరావు

ఉత్తగడ్డికి నిప్పు పెడితే..  పంట పొలం కాలింది..!
X

దిశ, తల్లాడ : ఉత్తగడ్డికి నిప్పు పెడితే పంట పొలం కాలిన ఘటన శనివారం తల్లాడ మండలంలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం కొత్త వెంకటగిరి గ్రామానికి చెందిన మల్లెల గోపాలరావు సమీపంలోని తన కౌలుకు చేసిన వరి పొలంలో పంటను హార్వెస్టర్ తో కోసిన తర్వాత గడ్డిని తొలగించేందుకు నిప్పు పెట్టాడు. ఆ పక్కనే ఉన్న పంట పొలాలకు నిప్పు అంటుకొని పూర్తిగా కాలిపోయాయి. అన్నారు గూడెం గ్రామానికి చెందిన దుగ్గిని గోపయ్య 3 ఎకరాలు, వెంకటయ్యకు చెందిన 3 ఎకరాల్లో వరి పంట పూర్తిగా కాలిపోయింది. దిరిశాల రాఘవయ్య కుచెందిన 4 ఎకరాలు జామాయిల్ తోట తో పాటు దిరిశాల లోకేశ్వరావు కు చెందిన 10 ఎకరాల్లో వరిగడ్డి కాలిపోయింది. దాదాపు 15 లక్షల పైన నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. ఈ మేరకు బాధితులు తల్లాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Next Story