భార్యను అతి కిరాతతంగా హతమార్చిన భర్త

by velandi.Saikiran |

మూడు ముళ్ళు వేసి.. ఏడు అడుగులు నడిచి... నూరేళ్లు కష్టసుఖాల్లో తోడుంటానని... పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసిన భర్త

భార్యను అతి కిరాతతంగా హతమార్చిన భర్త
X

దిశ/జూలూరుపాడు: మూడు ముళ్ళు వేసి.. ఏడు అడుగులు నడిచి... నూరేళ్లు కష్టసుఖాల్లో తోడుంటానని... పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసిన భర్త కసాయివాడిగా మారాడు. పొలానికి వెళ్దామని తీసుకెళ్లిన భర్త, అతి కిరాతకంగా భార్యను నరికి హతమార్చిన సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు గ్రామానికి చెందిన ధారావత్ గోపి, సునీత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఈ క్రమంలో తరచూ భార్యతో గొడవలు పడుతున్న గోపి, భార్య సునీతపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ప్లాన్‌ ప్రకారం, తన వెంట కోట కత్తి తీసుకొని భార్యను పంట పొలంలోకి తీసుకువెళ్లాడు. ఇక‌ మధ్యాహ్న సమయంలో భార్య ముఖంపై కోట కత్తితో అతి కిరాతకంగా నరికి చంపాడు. భార్యను చంపిన‌ తర్వాత భర్త గోపి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని ఇద్ద‌రి మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Next Story