- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాలిదుమారానికి ఇల్లు నేలమట్టం..
బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీలోని రాజీవ్ నగర్ కాలనీలోని సత్యసాయి మోడల్ స్కూల్ ఏరియాలో ఆదివారం రాత్రి వచ్చిన గాలిదుమారానికి పడిగేప్రసాద్ అనే గిరిజనుడి ఇల్లు నేలమట్టమైంది.

దిశ, బూర్గంపాడు : బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీలోని రాజీవ్ నగర్ కాలనీలోని సత్యసాయి మోడల్ స్కూల్ ఏరియాలో ఆదివారం రాత్రి వచ్చిన గాలిదుమారానికి పడిగేప్రసాద్ అనే గిరిజనుడి ఇల్లు నేలమట్టమైంది. ఇళ్లు కుప్పకూలడంతో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే సోమవారం ఉదయం భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) బృందం సభ్యులు సందర్శించారు.
వారి ఇంటికి వెళ్లి వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి మువ్వా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం తరుపున రావాల్సిన సాయం కొరకు పై అధికారులకు తెలియజేసి న్యాయం జరిగేలా చూస్తామని హామీఇచ్చారు. గాలిదుమారానికి నష్టపోయిన ప్రతిఒక్కరిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తిగా ఇల్లు కూలిపోయిన పడిగ ప్రసాదుకు తక్షణమే సాయం అందించాలని, లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ ఆధ్వర్యంలో బాధితుల పక్షానన్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో పేరాల శ్రీనివాసరావు బాదం మాధవరెడ్డి, వై.వెంకటేశ్వర్లు గుమ్మడి జగ్గారావు తదితరులు పాల్గొన్నారు.






