దొంగలున్నారు జాగ్రత్త

by velandi.Saikiran |

పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘంలో నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేయడమే కాకుండా, పలు అవినీతి ఆరోపణలు ఉన్న వారిని

దొంగలున్నారు జాగ్రత్త
X

దిశ, భద్రాచలం: పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘంలో నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేయడమే కాకుండా, పలు అవినీతి ఆరోపణలు ఉన్న వారిని యూనియన్ నుంచి బహిస్కరించినా...వాళ్లు అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్నారని, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోబోతున్నామని పిఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పులగం దామోదర్ రెడ్డి, బిక్షం గౌడ్ లు ఆరోపించారు. భద్రాచలం వెంకట్ నిలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, రాష్ట్రం లోనే 70 వేల సభ్యత్వాలు కలిగిన అతిపెద్ద ఉపాధ్యాయ యూనియన్ పిఆర్టీయూ అని అన్నారు. గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా పని చేసిన వారు పిఆర్టీయూ బిల్డింగ్ నిర్మాణం పేరుతో ఉపాధ్యాయుల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో సైతం పి ఆర్ టీ యూ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పని చేయడంతో వెంకటేశ్వర్లు, రవి ని యూనియన్ నుండి బహిస్కరించినా... ఇంకా వారే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా చెప్పుకుంటూ, అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని అన్నారు.

వారిపై త్వరలో క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పి ఆర్ టీ యూ నూతన అధ్యక్షులుగా నర్సయ్య, ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్ ను నియమించిన‌ట్లు తెలిపారు. నూతన సభ్యత్వ సేకరణలో భాగంగా జిల్లాకు రావడం జరిగిందని, 13 వందల సభ్యత్వ నమోదు పూర్తి అయుందని వెల్ల‌డించారు. మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, కౌన్సిలింగ్ ద్వారా ఉపాధ్యాయ బదిలీల విధానం, పెన్షన్ సౌకర్యం కల్పించిన ఘనత పి ఆర్ టీ యూ కే దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉపాధ్యాయులకు ఇచ్చిన హమీ నిలబెట్టుకోవాలని కోరారు. , 6 డి ఏ లతో పాటు పిఆర్సి అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 9 లోగా పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టీ యూ మాజీ అధ్యక్షులు కే. వెంకట్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు దనకొండ శ్రీనివాస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు నర్సయ్య, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, జిల్లా నాయకులు పటేల్, భాస్కర్, భద్రాచలం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కృష్ణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Next Story