- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్షం వస్తే అంతే సంగతులు
నగరంలో పడుతున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. శనివారం మధ్యాహ్నం రెండు గంటల పాటు కురిసిన వర్షానికి రోడ్లపై

దిశ, ఖమ్మం : నగరంలో పడుతున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. శనివారం మధ్యాహ్నం రెండు గంటల పాటు కురిసిన వర్షానికి రోడ్లపై నీరు భారీగా చేరింది. ఖమ్మం నగరంలోని కొత్త బస్టాండ్, రాపర్తి నగర్, బైపాస్ రోడ్ ప్రాంతాల్లో వర్షం నీళ్లు రోడ్లపైకి వచ్చి చేరాయి. దీంతో పలు కాలనీ వాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో వర్షం నీళ్లు ఇళ్లకి వచ్చిందని కాలనీ ప్రజలు చెబుతున్నారు.
కొత్త బస్టాండ్ ఎదురుగా గా శ్రీరాం నగర్ ప్రాంతంలో వర్షం నీళ్లతో డ్రైనేజీలు పొంగి రోడ్లపై నీళ్లు భారీగా వచ్చి చేరాయి. ప్రస్తుతం అ ప్రాంతం మొత్తం చెరువులను తలపిస్తున్నాయి. వర్షం నీళ్లు భారీగా రోడ్లపై వచ్చాయని కార్పొరేషన్ అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకునే నాధుడు లేడని కాలనీ ప్రజలు చెప్తున్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు ఆ ప్రాంతంలో పర్యటించి...సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.






