దిశ ఎఫెక్ట్.....మాకు బిల్లు ఇవ్వలేదంటే, మాకు బిల్లు ఇవ్వలేదు

by velandi.Saikiran |

"హలో దిశ విలేఖరి గారండి.... నేను నిజామా బాద్ నుంచి మాట్లాడుతున్నా..... నేను విజయవాడ కేంద్రంగా ఓ హార్వెస్టర్ ను

దిశ ఎఫెక్ట్.....మాకు బిల్లు ఇవ్వలేదంటే, మాకు బిల్లు ఇవ్వలేదు
X

దిశ, వైరా: "హలో దిశ విలేఖరి గారండి.... నేను నిజామా బాద్ నుంచి మాట్లాడుతున్నా..... నేను విజయవాడ కేంద్రంగా ఓ హార్వెస్టర్ ను కొనుగోలు చేశాను. ఈ హార్వెస్టర్ కు సంబంధించి స్పేర్ పార్ట్స్ కు బహిరంగ మార్కెట్లో కంటే మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు.... మీరు రాసిన వార్త కథనం అక్షర సత్యం సార్.... ఈ విషయాన్ని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత దిశ పైన ఉంది.... " అంటూ నిజామాబాద్ కు చెందిన ఓ హార్వెస్టర్ యజమాని తన గోడును వెల్లబుచ్చారు. దిశ వెబ్ సైట్ లో "నోబిల్..... అంతా మోసమే" అనే వార్త కథనం ప్రచురించమైన గంటలోపే ఖమ్మం, నిజామాబాద్, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన సుమారు పదిమంది హార్వెస్టర్ యజమానులు దిశ కు ఫోన్ చేసి మాట్లాడారు.

ప్రధానంగా జగ్గయ్యపేటకు చెందిన ఒక హార్వెస్టర్ యజమాని ఓ డీలర్ తనను తీవ్ర మానసిక ఆందోళనలకు గురి చేస్తున్నారని తన ఆవేదనను దిశకు వెళ్ళబుచ్చారు. హార్వెస్టర్ కు సంబంధించిన వారంటీలో భాగంగా ఛాయిస్ కు వారెంట్ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. తన హార్వెస్టర్ కు ఛాయస్ వెయ్యాలంటే లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నారని ఆయన ఆధారాలతో పేర్కొన్నారు. అంతేకాకుండా కృష్ణా జిల్లాకు చెందిన కొంతమంది హార్వెస్ట్ ఓనర్లు బెల్టులకు మూడు రెట్లు అధికంగా బిల్లులు వసూలు చేసే విషయం వాస్తవమేనని పేర్కొన్నారు. కనీసం బిల్లు ఇవ్వని మాట దిశలో వచ్చిన విధంగా నిజమేనని పేర్కొన్నారు. దిశలో వార్త కథనం ప్రచురితం కావడంతో విజయవాడలో హార్వెస్టర్లు తీసుకున్న సుమారు 10 మంది హార్వెస్టర్ ఓనర్లు సదరు కంపెనీపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు తాడేపల్లిగూడెంలో హార్వెస్టర్లు తీసుకున్న ఓనర్లు దిక్కు తోచని స్థితిలో ముందుకు వెనక్కుకు వెళ్లలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

Next Story