- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేలంపాట ద్వారా ఎన్నికైన గ్రామపంచాయతీలను రద్దు చేయాలి : సీపీఎం
దిశ: పాల్వంచ రూరల్ : వేలం పాట ద్వారా ఎన్నికైన గ్రామపంచాయతీలను తక్షణమే రద్దు చేయాలని

దిశ: పాల్వంచ రూరల్ : వేలం పాట ద్వారా ఎన్నికైన గ్రామపంచాయతీలను తక్షణమే రద్దు చేయాలని వేలంపాటలకు ప్రోత్సహిస్తున్న రాజకీయ పార్టీలను నాయకులను తరిమికొట్టాలని, ప్రజలకు అందుబాటులో ఉండి నిజాయితీతో పాలన అందించే నాయకులను ప్రజల భాగస్వామ్యంతో ఎన్నుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం పాల్వంచ మండలంలో పోటీ చేస్తున్న గ్రామపంచాయతీ అభ్యర్థులతో మండల కమిటీ సమావేశం కామ్రేడ్ భుక్యా లాలూ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రజలకి ఎన్నడు తెలియని వారు డబ్బు లతో వ్యాపారం చేసే కొద్దిమంది పలుకుబడి కలిగిన వ్యక్తులు ఎన్నికల ముందు వచ్చి ప్రజల భాగస్వామ్యం లేకుండా వేలంపాటలు పెట్టి ఏకిగ్రవాలు చేసుకొని పంచాయతీ సర్పంచిగా ఎన్నికవుతున్నారని ఇది తప్పుడు సంస్కృతికి దారితీస్తుందని ఆయన అన్నారు. ఇటువంటి వాటిని ప్రోత్సహించే రాజకీయ పార్టీలను కూడా ప్రజలు తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. డబ్బు రాజకీయాలతో ముందుకు వచ్చేవారు ప్రజలకు సేవ చేయరని డబ్బు సంపాదించే దానిపైనే వారి దుష్టుంటుందని ఆయన అన్నారు. పంచాయతీలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి నిజాయితీతో సేవ చేసేవారు సర్పంచులుగా గెలిస్తే గ్రామాల అభివృద్ధి అవుతాయని అటువంటి వారిని గెలిపించాల్సిన బాధ్యత ప్రజలధని అన్నారు. ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోకుండా వేలం పాటలు పెట్టి డబ్బు రాజకీయాలను వెదజల్లుతున్న కుహనా రాజకీయ నాయకులను ప్రజల నుండి తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన వెంకటేశ్వర్లు మండల కార్యదర్శి పాకాల వెంకటరావు నాయకులు శంకరన్న ప్రసాదు పెద్దబాబు నాగభూషణం సర్పా నరేందర్ మల్లు శ్రీను నాగార్జున కంట శ్రీను వినోద నరేందర్ సైదులు వెంకన్న అచ్చయ్య దేవా భద్రయ్య మాడవి సురేష్ తదితరులు పాల్గొన్నారు






