- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భద్రాద్రి వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి
భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. గురువారం ఉదయం 4 గంటలకు 29 అడుగులు ఉన్న గోదావరి, సాయంత్రం 4 గంటలకు

దిశ, భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. గురువారం ఉదయం 4 గంటలకు 29 అడుగులు ఉన్న గోదావరి, సాయంత్రం 4 గంటలకు 38.60 అడుగులకు పెరిగి, 6 గంటలవరకు నిలకడగా ప్రవహించింది. 7 గంటలనుండి తగ్గుముఖం పట్టింది. రాత్రి 8 గంటలకు 38.20 అడుగులకు తగ్గి ప్రవహిస్తోంది. కాగా రాత్రి 8 గంటలకు చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్ కు 18,819 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో 15 గేట్లు ఎత్తి 19,653 క్యూసెక్కుల నీటిని దిగువనున్న గోదావరిలోకి వదులుతున్నారు.
పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్ట్ ఒక గేట్ ఓపెన్ చేసి 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువనున్న కిన్నెరసాని నదిలోకి వదిలారు. కాగా గురువారం అత్యధికముగా దుమ్ముగూడెం మండలంలో 46.8 ఎం ఎం వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉండగా, శ్రీరామ సాగర్ ప్రాజెక్ట్, కడెం ప్రాజెక్ట్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్, లక్ష్మీ బేరేజ్, ఇంద్రావతి నుండి భారీగా వరదనీరు వస్తుండటంతో సమ్మక్క సాగర్ బేరేజ్ నుండి 7 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో భద్రాచలం వద్ద గోదావరి మళ్ళీ పెరిగే అవకాశం ఉంది.






