నెమ్మదిగా పెరుగుతున్న గోదావరి

by Chintha Aamani |

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నెమ్మదిగా పెరుగుతుంది.

నెమ్మదిగా పెరుగుతున్న గోదావరి
X

దిశ,భద్రాచలం : రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నెమ్మదిగా పెరుగుతుంది. బుధవారం రాత్రి 10 గంటలకు 18 అడుగులు ఉన్న గోదావరి, గురువారం సాయంత్రం 6 గంటలకు 19.09 అడుగులకు పెరిగి ప్రవహిస్తుంది. 1,71,154 క్యూసెక్కుల వరద నీరు దిగువకు తరలి వెళ్ళింది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి 2265 క్యూసెక్కుల వరద నీటిని దిగువనున్న గోదావరిలోకి వదిలారు. కిన్నెరసాని జలాశయం కు భారీగా వరదనీరు వచ్చి చేరడంతో గురువారం రాత్రి 10 గంటలకు ఒక గేట్ ఓపెన్ చేసి 4 వేల క్యూసెక్కుల నీటిని కిన్నెరసాని నదిలోకి వదలనున్నారు. 4200 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్ట్ కు వచ్చి చేరింది.

Next Story