చిరు వ్యాపారులకు గ్యాస్ కష్టాలు..సిలిండర్‌కు రూ.2 వేలు

by velandi.Saikiran |   (  Updated:2026-03-19 22:15:18  IST  )

సత్తుపల్లి నియోజవర్గం పరిధిలో చిరువ్యాపారులు గ్యాస్ కొరత, అధిక ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

చిరు వ్యాపారులకు గ్యాస్ కష్టాలు..సిలిండర్‌కు రూ.2 వేలు
X

చిరు వ్యాపారులకు గ్యాస్ కష్టాలు

హోటల్స్, కర్రీ పాయింట్ నిర్వహకుల అవస్థలు

సిలిండర్‌కు రూ.1300నుంచి రూ.2వేలు వరకు విక్రయం

సత్తుపల్లి నియోజవర్గం పరిధిలో చిరువ్యాపారులు గ్యాస్ కొరత, అధిక ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలో దాదాపు 150నుంచి 200కు పైగా టిఫిన్ సెంటర్లు, కర్రీ పాయింట్ బిర్యాని పాయింట్లు, టీ స్టాల్స్, ఫాస్ట్ ఫుడ్స్ సెంటర్లు రోడ్డు పక్కన ఏర్పాటు చేసుకొని జీవనోపాధితో కల్పించడంతో పాటు వారూ ఉపాధి పొందుతున్నారు. కొన్ని రోజులుగా గ్యాస్ కంపెనీలు డొమెస్టిక్ సిలిండర్, కమర్షియల్ సిలిండర్ సరఫరాలో నిబంధనలు పెట్టడంతో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. గ్యాస్ కొరత నేపథ్యంలో రూ.950ఉన్న గ్యాస్ బండ రూ.1300 నుంచి రూ.2వేలు వరకు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తుండగా, కట్టెల వ్యాపారులు రేట్లు అమాంతం పెంచారు. గ్యాస్ బుకింగ్ చేసినా సరఫరాలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. నెలవారీ అద్దెలు, కరెంట్ బిల్లు, ఈఎంఐ చెల్లించేందుకు అవస్థలు పడుతూ కొందరు తమ షాపులు మూసివేస్తున్నారు.

దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా చిరు వ్యాపారులకు గ్యా్స్ కష్టాలు చుట్టుముట్టాయి. నియోజకవర్గంలో దాదాపు 150నుంచి 200కు పైగా టిఫిన్ సెంటర్లు, కర్రీ పాయింట్ బిర్యాని పాయింట్లు, టీ స్టాల్స్, ఫాస్ట్ ఫుడ్స్ సెంటర్లు రోడ్డు పక్కన ఏర్పాటు చేసుకొని జీవనోపాధితో కల్పించడంతో పాటు వారూ ఉపాది పొందుతున్నారు. ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా డొమెస్టిక్ సిలిండర్, కమర్షియల్ సిలిండర్ రేట్లు పెంచడంతో పాటు మార్కెట్లోకి గ్యాస్ తగిన విధంగా సప్లై కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ కంపెనీలు డొమెస్టిక్ సిలిండర్, కమర్షియల్ సిలిండర్ సరఫరాలో నిబంధనలు పెట్టడంతో చిరు వ్యాపారులకు గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. గత 15రోజులుగా గ్యాస్ కంపెనీలు సరఫరా నిలిపివేయడంతో నెలవారి అద్దెలు, కరెంట్ బిల్లు, ఈఎంఐ చెల్లించేందుకు అవస్థలు పడుతున్నారు.

మూతపడుతున్నాయి

గ్యాస్ కొరతతో సత్తుపల్లి పరిధిలోని టిఫిన్ సెంటర్లు, కర్రీ పాయింట్ బిర్యాని పాయింట్, చిన్న చిన్న హోటళ్లు మూతబడుతున్నాయి. హోటల్లో పనిచేసే వందలాదిమంది కార్మికులు జీవనోపాధి కోల్పోతున్నారు. ప్రస్తుతం ఉగాది, రంజాన్, ఈస్టర్ వంటి పండగల నేపథ్యంలో కుటుంబ సమేతంగా హోటల్స్ రెస్టారెంట్‌కు వెళ్తుంటారని, గ్యాస్ కొరతతో అవకాశం లేకుండా పోయిందని వినియోగదారులతో పాటు హోటల్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.950ఉన్న గ్యాస్ బండ ప్రస్తుతం గ్యాస్ కొరత నేపథ్యంలో రూ.1300 నుంచి రూ.2వేలు వరకు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. గ్యాస్ బుకింగ్ చేసినా సరఫరాలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ కొరత దృష్టిలో ఉంచుకుని, కట్టెల వ్యాపారులు రేట్లు అమాంతం పెంచారు.

ఆన్‌లైన్ బుకింగ్ మేరకు సరఫరా

గ్యాస్ కంపెనీ నిర్వహకులు

గ్యాస్ కంపెనీ నిబంధన మేరకు ఆన్‌లైన్ బుకింగ్ చేసిన ప్రతి కస్టమర్‌కు గ్యాస్ సరఫరా చేస్తాం. గ్యాస్ సరఫరా నిలిచిపోతుందని సోషల్ మీడియాలో ప్రచారం చేయటంతో వినియోగదారులు అందరూ ఒకేసారి బుక్ చేయటంతో ఆన్‌లైన్‌లో కొంత ఆటంకం ఏర్పడింది. నెమ్మదిగా ఆన్‌లైన్ బుకింగ్ కొనసాగుతుంది. ఆన్‌లైన్ బుకింగ్ మేరకే గ్యాస్ సరఫరా జరుగుతుంది. గ్యాస్ వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు.

Next Story