- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనాధ మృతదేహాలకు అంత్యక్రియలు
by velandi.Saikiran |
నగరంలోని అన్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మూడు అనాధ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు

X
దిశ, ఖమ్మం కార్పొరేషన్: నగరంలోని అన్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మూడు అనాధ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. నాలుగు రోజుల క్రితం వివిధ పోలీస్ స్టేషన్ లో పరిధిలో లభ్యమైన గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలను పోలీసులు ఖమ్మం ప్రభుత్వ వైద్యశాల మార్చరీలో భద్రపరిచారు. ఇప్పటి వరకు మృతదేహాల కోసం ఎవరూ రాకపోవటం తో గుర్తుతెలియని అనాధ శవాలుగా భావించిన పోలీసులు, మృతదేహాలకు అంత్యక్రియలు కోసం అన్నం ఫౌండేషన్ కు సమాచారం ఇచ్చారు. మూడు మృతదేహాలను మార్చురి నుండి పోలీసులు, వైద్యశాల సిబ్బంది సమక్షంలో అన్నం ఫౌండేషన్ వారు స్వాధీనం చేసుకొని బల్లేపల్లి వైకుంఠధామంకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నం పౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






