- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ ఆసుపత్రికి ఫ్రిజ్ వితరణ
by velandi.Saikiran |
వైరా లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ఎస్ఐ పుష్పాల రామారావు సహకారంతో ఓ స్వచ్ఛంద సంస్థ ఫ్రిజ్ ను వితరణగా అందజేశారు.

X
దిశ, వైరా : వైరా లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ఎస్ఐ పుష్పాల రామారావు సహకారంతో ఓ స్వచ్ఛంద సంస్థ ఫ్రిజ్ ను వితరణగా అందజేశారు. వైరాలో ఇటీవల ఏర్పాటు చేసిన ఏరియా ఆసుపత్రిలో వ్యాక్సిన్ తో పాటు అత్యవసర మందులు నిల్వ ఉంచేందుకు ఫ్రిజ్ లేదనే విషయాన్ని ఇటీవల అక్కడి వైద్యులు బానోత్ బాలు.... ఎస్ఐ దృష్టికి తీసుకువచ్చారు.
దీంతో వెంటనే స్పందించిన ఎస్సై రామారావు... సమారిటన్స్ ఫర్ ది నేషన్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. ఎస్ఐ విజ్ఞప్తితో ఆ సంస్థ ప్రతినిధులు ఫ్రీజ్ వితరణగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. వైరా లోని ఏరియా హాస్పిటల్ లో మంగళవారం ఫ్రిజ్ ను ఎస్ఐ రామారావు, సంస్థ ప్రతినిధులు డాక్టర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు బాలు, వెంకటేశ్వర్లు సమారిటన్స్ వ్యవస్థాపకులు రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






