- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దమ్మపేట రహదారిపై.. 'విదేశీ' సోయగం
దమ్మపేట నుంచి మందలపల్లి వెళ్లే ప్రధాన రహదారి వాహనదారులకు సరికొత్త అనుభూతినిస్తుంది.

X
దిశ, దమ్మపేట: తెలుగు రాష్ట్రాల్లో భానుడు అప్పుడే సెగలు పుట్టిస్తున్నా.. దమ్మపేట నుంచి మందలపల్లి వెళ్లే ప్రధాన రహదారి మాత్రం వాహనదారులకు సరికొత్త అనుభూతినిస్తుంది. ఈ మార్గంలో ఇరువైపులా 'పింక్ ట్రంపెట్' వృక్షాలకు వికసించిన పూలు చూస్తుంటే.. మనం దమ్మపేటలో ఉన్నామా లేక జపాన్‌లోని టోక్యో వీధుల్లో ఉన్నామా అన్న భ్రమ కలుగుతుంది. సాధారణంగా జపాన్, అమెరికా వంటి దేశాల్లో కనిపించే 'చెర్రీ బ్లూసమ్' అందాలను ఈ పింక్ ట్రంపెట్ పూలు తలపిస్తున్నాయి. కొమ్మలకు ఆకులే కనిపించనంతగా గులాబీ రంగు పూలు పూయడంతో, ఆ మార్గమంతా ఒక విదేశీ నగరాన్ని తలపిస్తోంది. గాలికి రాలి రోడ్డుపై పడుతున్న పూల రేకులు, బాటసారులకు గులాబీ రంగు తివాచీ పరిచినట్టుగా స్వాగతం పలుకుతున్నాయి.
Next Story






