- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత : సీపీ సునీల్ దత్
దిశ, ఖమ్మం రూరల్ : గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు, రాజకీయ నాయకుల బాధ్యత ఉంటుందని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు.

దిశ, ఖమ్మం రూరల్ : గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు, రాజకీయ నాయకుల బాధ్యత ఉంటుందని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. మంగళవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట సర్కిల్ వద్ద గల రామ్ లీలా ఫంక్షన్.. ఖమ్మం రూరల్ మండలానికి సంబంధించి వివిధ రాజకీయ పార్టీ నాయకులతో ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ నెల 14న మండలంలోని గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో 12వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ప్రచార కార్యక్రమాలు ముగించాలన్నారు. ప్రతి గ్రామంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ తరపున, ఎన్నికల అధికారుల తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. గ్రామంలో ఎలాంటి అలజడులు, గొడవలకు తావిపోవద్దని, వ్యక్తిగత వివాదాలకు చోటు ఇవ్వరాదన్నారు. ఎన్నికల నియమాలను తప్పకుండా పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, తాసిల్దార్ పెళ్లి రాంప్రసాద్, రూరల్ సబ్ డివిజన్ చెందిన సిఐలు, ఎస్సైలు ఉన్నారు.






