ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలి : మ‌ణుగూరు డీఎస్పీ ర‌వీంద‌ర్ రెడ్డి

by Ratna Kumari |

ప్రజలు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి అన్నారు.

ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలి : మ‌ణుగూరు డీఎస్పీ ర‌వీంద‌ర్ రెడ్డి
X

దిశ, మణుగూరు : ప్రజలు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం తెల్లవారుజామున మణుగూరు మున్సిపాలిటీ శేషగిరినగర్ గ్రామంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు కాదని మీ సమస్యల పరిష్కారం కోసమే అన్నారు. మీ గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా తప్పనిసరిగా పోలీసులకు తెలియజేయాలన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడమే కమ్యూనిటీ కాంటాక్ట్ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రజల వద్ద కొన్ని సమస్యలు తెలుసుకున్నామని తప్పకుండా చర్యలు తీసుకోవడమే కాకుండా ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ పెంచుతామన్నారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరిస్తే పోలీస్ కి సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా 41 ద్విచక్ర వాహనాలు పట్టుకోవడం జరిగిందని, అలాగే మూడు బెల్ట్ షాపుల పైన రైడ్ చేసి రూ. 25000 మద్యం స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఇన్సూరెన్స్ కాగితాలు లేకపోతే వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగబాబు, ఎస్సై నగేష్ కుమార్, ఎస్సై శ్రావణ్ కుమార్, బయ్యారం ఎస్సై సురేష్, ఏ ఎస్సై శాంతి, ఝాన్సీ, బుచ్చిబాబు, మురారి, సత్యనారాయణ, ప్రసాదు, టీజీఎస్పి రామారావు, రామకృష్ణ, సైదులు, రాజగోపాల్, హెడ్ కానిస్టేబుల్ షరీఫ్ పాల్గొన్నారు.

Next Story