పదో తరగతి విద్యార్థులకు అంతర్గత మార్కులకు మూల్యాంకన

by Ratna Kumari |   (  Updated:2026-02-17 13:02:02  IST  )

రాష్ట్ర విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు పదో తరగతి కామన్ పరీక్షలు నిర్వహణకు ముందు అంతర్గతంగా విద్యార్థులకు వేయాల్సిన‌ మార్కుల పట్టిని వారి పురోగతి ప్రకారం.. మూల్యాంకన చేసి మార్పులు కేటాయించడం జరుగుతుంది.

పదో తరగతి విద్యార్థులకు అంతర్గత మార్కులకు మూల్యాంకన
X

దిశ, ఏన్కూర్ : రాష్ట్ర విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు పదో తరగతి కామన్ పరీక్షలు నిర్వహణకు ముందు అంతర్గతంగా విద్యార్థులకు వేయాల్సిన‌ మార్కుల పట్టిని వారి పురోగతి ప్రకారం.. మూల్యాంకన చేసి మార్పులు కేటాయించడం జరుగుతుంది. విద్యార్థులకు ఇంటర్నల్ మార్కులు కేటాయించే సమయంలో వారు ఆయా సబ్జెక్టులో ఏవిధంగా పురోగతి ఉందనేది స్వయంగా ఉపాధ్యాయుల బృందం పరిశీలించిన అనంతరమే మార్కులు వేస్తారు. మండల కేంద్రంలోని తెలంగాణ గురుకుల పాఠశాలలో టీం మేనేజర్ లక్ష్మా ఆధ్వర్యంలో వివిధ పాఠశాల ఉపాధ్యాయులు అంతర్గత మూల్యాంకణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సబ్జెక్టుల వారీగా ఆయా సబ్జెక్టు టీచర్లు ఉపాధ్యాయ బృందానికి వివరించారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల ప్రకారం.. ప్రతి సంవత్సర నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం పాఠశాలలో ఇంటర్నల్ మార్కుల కార్యక్రమం నిర్వహించారు.

Next Story