- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఒడిశా మావోయిస్టు పార్టీ చీఫ్ చలపతి మృతి
ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని గరియాబంద్ జిల్లా కులారి ఘాట్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులలో మంగళవారం 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.

దిశ భద్రాచలం: ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని గరియాబంద్ జిల్లా కులారి ఘాట్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులలో మంగళవారం 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే, ఈ ఎన్‌కౌంటర్‌లో శ్రీకాకుళం కోరాపుట్ డివిజన్ ఇన్‌ఛార్జ్ చలపతి మృతి చెందారు. ఆయనపై రూ.కోటి రివార్డు కూడా ఉంది. చలపతి స్వస్థలం చిత్తూరు జిల్లాగా తెలుస్తోంది. అదేవిధంగా ఒడిశా మావోయిస్టు పార్టీ సెక్రటరీగా ఉన్న మొండెం బాలకృష్ణ కూడా మృతి చెందారు. సోమవారం తెల్లవారుజామున మొదలైన ఈ ఎదురుకాల్పుల్లో నిన్న ఇద్దరు మావోయిస్టుల మృతి చెందగా, ఓ జవానుకు గాయాలయ్యాయి. ఇప్పటి వరకు ఈ కూబింగ్ ఆపరేషన్‌లో మొత్తం 14 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా భద్రతా బలగాలు తెలిపాయి. అయితే, మృతుల్లో పలువురు ప్రముఖ మావోయిస్టు నేతలు కూడా ఉన్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.






