- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నలభై ఎనిమిది గంటల్లో పదకొండు కాన్పులు
దిశ, అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ రాధ రుక్మిణి, ప్రసూతి వైద్యరాలు డాక్టర్ మౌనిక ఆధ్వర్యంలో నలభై ఎనిమిది గంటల్లో

దిశ, అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ రాధ రుక్మిణి, ప్రసూతి వైద్యరాలు డాక్టర్ మౌనిక ఆధ్వర్యంలో నలభై ఎనిమిది గంటల్లో పదకొండు మందికి పురుడు పోశారు. అందులో ఎనిమిది సాధారణ కాన్పులు కాగా, మూడు ఆపరేషన్ చేసి పురుడు పొశారు. రోగులు ప్రభుత్వ ఆసుపత్రి ల మీద నమ్మకానికి ఈ సంఘటన నిదర్శనంగా చెప్పవచ్చు. ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చేస్తున్నారు. బిడ్డ ఎదుగుదల చూపే టిఫా స్కాన్ వంటి అత్యాధునిక యంత్రాలు అందుబాటులో ఉండడం, ఇతర సదుపాయాలు కల్పించడంతో రోగుల తాకిడి పెరిగింది. ఇటీవల అశ్వారావుపేట లో స్థానిక ఎంఎల్ఏ ఆదినారాయణ, కలెక్టర్ సూచన మేరకు ఒక పిల్లల వైద్యుడు, అదనంగా ఒక ప్రసూతి వైద్యురాలు,మత్తు వైద్యుడిని డిసిహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు నియమించారు. నాటినుండి ప్రసూతి వైద్యులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండడం తో ప్రసూతి సేవలు మెరుగుపడి నెలకి పది నుండి యాభై పైగా ప్రసవాల సంఖ్య పెరిగింది. ఆసుపత్రి సేవల పట్ల అశ్వారావుపేట పరిసర ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ కార్యక్రమం లో ప్రసూతి వైద్యురాలు మౌనిక, పిల్లలు వైద్యుడు ప్రకాష్, మత్తు డాక్టర్ కృష్ణ ప్రసాద్, ఆసుపత్రి హెడ్ నర్సింగ్ ఆఫీసర్ మంగతాయమ్మ, ఊటీ నర్సింగ్ ఆఫీసర్ సుజాత, నర్సింగ్ ఆఫీసర్ లు వీరాకుమారి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.






