కాచిరాజుగూడెంలో అక్రమ మట్టి తరలింపులపై డీవైఎఫ్‌ఐ ఆందోళన

by Ratna Kumari |

కాచిరాజుగూడెం గ్రామంలో కొనసాగుతున్న అక్రమ మట్టి తరలింపులపై పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

కాచిరాజుగూడెంలో అక్రమ మట్టి తరలింపులపై డీవైఎఫ్‌ఐ ఆందోళన
X

దిశ, ఖమ్మం రూరల్: కాచిరాజుగూడెం గ్రామంలో కొనసాగుతున్న అక్రమ మట్టి తరలింపులపై పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మట్టి మాఫియా వ్యక్తులు నియంత్రణ లేకుండా తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్రమంగా మట్టి తరలింపులు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం డీవైఎఫ్‌ఐ కార్యకర్తలు రంగంలోకి దిగారు. గ్రామంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను అడ్డుకుని, పై అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వెంటనే స్పందించి జీపీఓ వనం శ్రీనివాసరావు ఏఎస్ఐ వెంకటరెడ్డిలు ఘటన స్థలానికి చేరుకుని రెండు లారీలను సీజ్ చేశారు. గ్రామంలో అక్రమ మట్టి తరలింపులను పూర్తిగా నిలిపివేయాలని, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అక్రమంగా మట్టి తోలకాలు చేపడుతున్న లారీలను ఆపే క్రమంలో గంధం. నాగేశ్వరరావు అనే లారీ ఓనర్ అనుచరులు కొంతమంది యువజన సంఘం నాయకులపై దాడి కి ప్రయత్నించి మీరు లారీలను పంపకపోతే మీ బొక్కలు విరగ్గొడతాం మీ సంగతి చూస్తాం అంటూ బెదిరింపులకు దిగగా గ్రామస్థులు తిరగబడడం తొ బెదిరింపులకు దిగిన వారు బండిపై పారిపోయారు.ఈ కార్యక్రమంలో DYFI నాయకులు పొన్నం మురళి, చాంద్ పాషా, సీపీఎం మండల నాయకులు పొన్నం వెంకటరమణ, పొన్నం బాస్కర్ రావు, యడ్లపల్లి. వీరయ్య, ఏలూరి నాగేశ్వరరావు, షైక్ సైదులు, కారుమంచి. చలమయ్య, జిల్లెల్ల. వెంకయ్య, వట్టేకోటి. ప్రయోజ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story