న్యూ ఇయ‌ర్ వేడుక‌లు రోడ్ల‌పై జ‌రప‌వ‌ద్దు : ఎస్సై నార బోయిన సంధ్య

by Ratna Kumari |

దిశ, ఏన్కూర్ : న్యూ ఇయర్ వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని, వేడుకలను రోడ్ల పైన జరుపుకోవద్దని, బాణసంచాలు కాల్చడం నిషేధించిన‌ట్టు ఏన్కూర్ ఎస్సై నార బోయిన సంధ్య అన్నారు.

న్యూ ఇయ‌ర్ వేడుక‌లు రోడ్ల‌పై జ‌రప‌వ‌ద్దు : ఎస్సై  నార బోయిన సంధ్య
X

దిశ, ఏన్కూర్ : న్యూ ఇయర్ వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని, వేడుకలను రోడ్ల పైన జరుపుకోవద్దని, బాణసంచాలు కాల్చడం నిషేధించిన‌ట్టు ఏన్కూర్ ఎస్సై నార బోయిన సంధ్య అన్నారు. తాజాగా ఆమె దిశ తో మాట్లాడుతూ ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు తీసి డ్రైవ్ చేయడం చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. తోటి వారికి ఇబ్బంది లేకుండా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాత్రి సమయంలో మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే.. డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసులు నమోదు చేస్తామ‌ని.. మైనర్లకు మద్యం అమ్మ రాదని తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ వారి ఆదేశాలతో పోలీస్ పెట్రోలింగ్ ఉంటుందని ప్రజలు పోలీసులుకు సహకరించి, న్యూ ఇయర్ వేడుకల్లో ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్సై సంధ్య తెలిపారు.

Next Story