- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్ సి జర్నలిస్టులకు జిల్లా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి..
నియోజకవర్గ కేంద్రాలలో ఆర్ సి ఇంచార్జ్ గా పనిచేస్తున్న జర్నలిస్టులకు జిల్లా ఎడిషన్ కార్డులు ఇచ్చి రాష్ట్రస్థాయిలో బస్ పాస్ సౌకర్యం కల్పించాలని సత్తుపల్లి జర్నలిస్ట్ అసోసియేషన్ తరపున జర్నలిస్టుల సమస్యలతో కూడిన వినతి పత్రం స్థానిక ఎమ్మార్వో కి అందజేశారు.

దిశ, సత్తుపల్లి: నియోజకవర్గ కేంద్రాలలో ఆర్ సి ఇంచార్జ్ గా పనిచేస్తున్న జర్నలిస్టులకు జిల్లా ఎడిషన్ కార్డులు ఇచ్చి రాష్ట్రస్థాయిలో బస్ పాస్ సౌకర్యం కల్పించాలని సత్తుపల్లి జర్నలిస్ట్ అసోసియేషన్ తరపున జర్నలిస్టుల సమస్యలతో కూడిన వినతి పత్రం స్థానిక ఎమ్మార్వో కి అందజేశారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టు మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా లేని నిబంధన ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా జీవో 252 తీసుకొచ్చి ఆర్ సి ఇంచార్జ్ లుగా ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు మండల అక్రిడేషన్ కార్డులు ఇచ్చి జిల్లా బస్సు పాసులు ఇవ్వడం ఏమిటని ఈ నిర్ణయాన్ని వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకొని నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు జిల్లా అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసి బస్సు పాస్, హెల్త్ కార్డ్, జర్నలిస్టులకు ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ రిపోర్టర్లు మాదిరాజు సుధాకర్, ఎండి షైబుద్ధిన్, చిన్నిని బాలకృష్ణ, షేక్ ఖాదర్ బాబా, బి.వి.రామారావు, తడకమళ్ళ దేవ, బేతి ఆనంద్, కె. సతీష్, రాజేష్, రెడ్డి, కె. బాలాజీ, చీపు గంగాధర్, బుల్లెపోగు సురేష్, గురవయ్య, కొత్తపల్లి సుధాకర్, మునీర్, కాకర్ల జగన్, బల్లం చిరంజీవి, కోట అశోక్ రాజా, తదితరులు పాల్గొన్నారు.






