- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్... అక్రమ నిర్మాణ బిల్డింగ్ పనులను అడ్డుకున్న అధికారులు
అనుమతులేని వెంచర్ లో పర్మిషన్ లేని స్కూల్ బిల్లింగ్ అనే కథనం దిశ దినపత్రికలో ఈ నెల 18న రాసిన కథనానికి మండలాధికారులను కదిలించింది.

దిశ, తల్లాడ: అనుమతులేని వెంచర్ లో పర్మిషన్ లేని స్కూల్ బిల్లింగ్ అనే కథనం దిశ దినపత్రికలో ఈ నెల 18న రాసిన కథనానికి మండలాధికారులను కదిలించింది. వివరాల్లోకి వెళ్తే తల్లాడ,కొత్తగూడెం రోడ్డులో గల శ్రీ సప్తగిరి హైవే వెంచర్ లో అక్రమంగా నిర్మిస్తున్న బిల్డింగ్ పనులను అధికారులు అడ్డుకున్నారు. ఎంపీడీవో సురేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఎటువంటి కట్టడాలు నిర్మించాలన్నా తల్లాడ మేజర్ పంచాయతీ నుండి ఎన్ ఓసీ పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు. సప్తగిరి వెంచర్ లో నిర్మిస్తున్న జి ప్లస్ టు బిల్డింగ్ కు ఎటువంటి పర్మిషన్ లేదని తెలియడంతో గత డిసెంబర్ 22న నోటీసులు జారీ చేశామని అయినా పనులు జరుగుతుండటంతో నిర్మాణ పనులను నిలిపివేయాలని ఆదేశించడంతో పంచాయతీ ఈవో కృష్ణారావు అక్కడికి వెళ్లి నిర్మాణ పనులను అడ్డుకున్నారు. పర్మిషన్ తీసుకున్నాకే నిర్మాణ పనులు చేపట్టాలని వెంచర్ నిర్వహకులతో మాట్లాడారు. సప్తగిరి వెంచర్ కు ఫైనల్ డీటీసీపీ అనుమతులు లేవని తెలిసింది. బిల్డింగ్ నిర్మాణానికి అనుమతులు లేకపోయినా జి ప్లస్ టు నిర్మించడంపై పంచాయతీ ఈవో పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈవో ప్రమేయంతోని ఈ తతంగం అంత జరుగుతుందనే చర్చ జరుగుతుంది. ఈవోను వివరణ అడుగుతుండగా పొంతన లేని సమాధానాలు చెప్పడం విశేషం..ఆ వెంచర్ కి డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్(డిటిసిపి) పర్మిషన్ వచ్చిందని కొన్ని పత్రాలు చూపించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సప్తగిరి వెంచర్ తోపాటు నిర్మిస్తున్న బిల్డింగ్ పై జిల్లా కలెక్టర్,విజిలెన్స్ అధికారులు దీనిపై పూర్తి విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుతున్నారు.






