- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోషల్ మీడియా వదంతులు నమ్మదు
చింతకాని మండలంలో రాజకీయం ఒక్క సారిగా వేడెక్కింది. ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నాటి నుండి తుమ్మల ప్రధాన

దిశ చింతకాని : చింతకాని మండలంలో రాజకీయం ఒక్క సారిగా వేడెక్కింది. ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నాటి నుండి తుమ్మల ప్రధాన అనుచరుడిగా మంచి పేరు సంపాదించుకున్న నాయకుడు పెంట్యాల పుల్లయ్య. బీఆర్ఎస్ పార్టీలోకి తుమ్మల వెళితే.. ఆయన వెంట నడించారు పుల్లయ్య. అయితే.. ఒక్కసారిగా పార్టీ మారుతున్నట్లు వచ్చిన వస్తున్న వార్తలను ఆయన కొట్టి పారేశారు.
సోషల్ మీడియా వదంతులు నమ్మదు అని తెలిపారు పెంట్యాల పుల్లయ్య. తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసిన మాట వాస్తవం అని... మండలంలో ప్రజా సమస్యల పరిష్కారం ఆయనకు వినతులు అందించామని తెలిపారు. మండల వ్యాప్తంగా యూరియా కొరత నేపథ్యంలో చింతకాని మండలానికి యూరియా బ్యాగుల కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేసినట్లు వివరించారు.
రెండు గ్రామాలకు కలిపి ఒక సొసైటీ గోడౌన్లను ఏర్పాటు చేయాలని కోరారట. ప్రొద్దుటూరుతో పాటు మరికొన్ని గ్రామాలకు ఇందిరమ్మ ఇల్లు మరికొన్ని కేటాయింపులు కూడా డిమాండ్ చేశారట. ఆయా పంచాయతీల్లో నిధులు కొరత ఉందని.. వాటికి నిధులు కేటాయించాలని డిప్యూటీ సీఎం కి వినతి పత్రం అందజేశానని పెంట్యాల పుల్లయ్య తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రస్తావన జరగలేదని క్లారిటీ ఇచ్చారు.






