‘కార్పొరేట్ శక్తులు పార్లమెంటరీ డెమోక్రసీకి సవాల్ విసురుతున్నాయి’: డిప్యూటీ సీఎం భట్టి

by Kodari Anjali |

తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచానికి కొత్త సందేశాన్ని ఇచ్చింది..

‘కార్పొరేట్ శక్తులు పార్లమెంటరీ డెమోక్రసీకి సవాల్ విసురుతున్నాయి’: డిప్యూటీ సీఎం భట్టి
X

దిశ, ఖమ్మం బ్యూరో: తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచానికి కొత్త సందేశాన్ని ఇచ్చింది.. మతం అనే సెంటిమెంటు పేరుతో ప్రస్తుతం దేశంలో ఆర్థిక, సామాజిక అంశాలను తప్పుదోవ పట్టించి కార్పొరేట్, ఫాసిస్టు శక్తులు పార్లమెంటరీ డెమోక్రసీకి ఛాలెంజ్ విసురుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం ఆయన ఖమ్మం జిల్లా కేంద్రంలో సిపిఐ శత వసంతాల సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ సెమినార్‌లో ప్రసంగించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఛాలెంజ్ విసురుతున్న కార్పొరేట్ శక్తులను, దేశంలో ఆర్థిక సామాజిక అంశాలను తప్పుదోవ పట్టిస్తున్న ఆశక్తులను ఐక్య పోరాటాల ద్వారా అడ్డుకట్ట వేద్దాం, కలిసి ముందుకు పోదామని వామపక్ష పార్టీలకు డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. దోపిడీ వర్గాలు, దోపిడీకి గురయ్యే వర్గాల మధ్య కాకుండా దేశంలో మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వామపక్షాలు ముందుకు కదలాలి అన్నారు.

ఖమ్మం జిల్లా అనేక రకాల భావజాలాల వ్యాప్తికి ఆహ్వానం..

వర్గ పోరాటం ద్వారానే సోషలిజం సాధ్యమని కార్లు మార్క్స్ చెప్పాడు. కానీ భారతదేశ మార్క్స్ అంచనాలకు మినహాయింపుగా మిగిలింది. భారతదేశ సమాజం వర్గాలపై కాకుండా కులాలపై నిర్మితమైందని జర్మన్ ఫిలాసఫర్ మార్క్స్ వెబర్ స్పష్టంగా చెప్పాడని సెమినార్లో డిప్యూటీ సీఎం వివరించారు. వర్గ పోరు అనేది లేకుండా చేసి పార్లమెంటు వ్యవస్థ ప్రశ్నార్ధకమైన నేపథ్యంలో కమ్యూనిస్టుల పాత్ర ఈ దేశంలో చాలా ప్రముఖమైనదని తెలిపారు. ఖమ్మం జిల్లా అనేక రకాల భావజాలాల వ్యాప్తికి ఆహ్వానం పలుకుతుంది. ఆతిథ్యానికి మారుపేరు ఖమ్మం, దేశవ్యాప్తంగా ఉన్న వామపక్షా నేతలు ఖమ్మం జిల్లాలో సమావేశం కావడానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నానని, అభినందిస్తున్నానని తెలిపారు. 100 సంవత్సరాల సిపిఐ చరిత్రలో ఎన్నో త్యాగాలు, ఆటుపోట్లు ఉన్నాయి.

రంకుశ నిజాం రాజును వ్యతిరేకించి..

ఈ దేశానికి స్వాతంత్రం సాధించడంలో సిపిఐది ప్రముఖస్థానం అన్నారు. భారతదేశం అంతటికీ 1947లో స్వాతంత్రం వస్తే తెలంగాణ ప్రాంతానికి ఒక సంవత్సరం తర్వాత స్వాతంత్రం సిద్ధించింది నిరంకుశ నిజాం రాజును వ్యతిరేకించి కమ్యూనిస్టులు చేసిన సాయుధ పోరాటం ప్రపంచానికి కొత్త సందేశాన్ని ఇచ్చింది అని వివరించారు. భూమికోసం, భుక్తి కోసం, పేదల విముక్తి కోసం.. దున్నేవానిదే భూమి, గ్రంథాలయ ఉద్యమం వంటి గొప్ప పోరాటాలతో తెలంగాణ విలసిల్లింది అన్నారు. ప్రధానంగా ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలో ఏ ఇంటి తలుపు తట్టిన ఒక పోరాట గాధ వినిపిస్తుంది అన్నారు. కాంగ్రెస్ పాలకులు బూర్గుల రామకృష్ణారావు 1950లో కౌలు గారి చట్టాన్ని తీసుకువచ్చారు.

వామపక్ష పార్టీల సహాయంతో కాంగ్రెస్ ప్రభుత్వాలు..

ఆ తర్వాత అందులో 19 70లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం భూ సంస్కరణల చట్టం, పేదల అభివృద్ధికి 20 సూత్రాల పథకం, బ్యాంకుల జాతీయ కరణ, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం వంటి గొప్ప చట్టాలను వామపక్ష పార్టీల సహాయంతో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ దేశంలో రాష్ట్రంలో తీసుకు రాగలిగాయి అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది లేదంటే సగటుకు మనిషికి హక్కులు దక్కకుండా పోతాయి, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఓటు హక్కును నాశనం చేస్తుంది, రాజ్యాంగంలో మార్పుల కోసం ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కలిసి ఈ దేశంలో సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గుర్తు చేశారు.

Next Story