- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీఈవోకు తప్పని తనిఖీ..
by Batti.Sumithra |
పదోతరగతి పరీక్షా కేంద్రం వద్ద జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మకు పోలీసు తనిఖీ తప్పలేదు.

X
దిశ, కారేపల్లి : పదోతరగతి పరీక్షా కేంద్రం వద్ద జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మకు పోలీసు తనిఖీ తప్పలేదు. పరీక్షా పేపర్లు సోషల్ మీడియాలో చక్కర్ల నేపధ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద తనిఖీలు అధికారులు ముమ్మరం చేశారు. పరీక్ష కేంద్రంలోనికి ఏ అధికారి వచ్చినా తనిఖీలు చేసి మరీ కేంద్రంలోనికి పంపిస్తున్నారు.
మంగళవారం కారేపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ పరీక్ష కేంద్రానికి జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ వచ్చారు. ఆయనను గేటు ముందేనిలిపిన పోలీసు సిబ్బంది క్షుణంగా తనిఖీ చేసిన అనంతరం లోనికి అనుమతించారు. కారేపల్లి మండంలోని మూడు పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 658 మంది హాజరు కావల్సి ఉండగా ఇద్దరు మాత్రమే గైర్హాజరైనట్లు ఎంఈవో జయరాజ్ తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరగటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






