- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాప్యం లేకుండా యూరియా పంపిణీ
by velandi.Saikiran |
రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేస్తున్నామని వైరా ఏడిఏ తుమ్మలపల్లి కరుణశ్రీ అన్నారు. ఆదివారం ఏన్కూరు

X
దిశ, ఏన్కూర్ : రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేస్తున్నామని వైరా ఏడిఏ తుమ్మలపల్లి కరుణశ్రీ అన్నారు. ఆదివారం ఏన్కూరు సొసైటీ కార్యాలయంలో యూరియా పంపిణీని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిమాండ్ కు సరిపడా యూరియా లేకపోవడంతో రైతులకు కూపన్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ, కూపన్లు ఇచ్చిన రైతులకు యూరియా పంపిణీ చేయడం కోసం ఏఈఓ లను అందుబాటులో ఉంచామన్నారు. ఏనుకూరు సొసైటీకి 20 టన్నులు యూరియా మంజూరి కావడంతో ఉన్న స్టాకు మొత్తం రైతులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఆమె వెంట సొసైటీ సీఈఓ మిరియాల నాగలక్ష్మి, ఏ ఈ ఓ లు, భాగ్యలహరి, అశోక్, నవ్య, మాజీ ఎంపీటీసీ మేడా ధర్మారావు, తదితర రైతులు సొసైటీ సిబ్బంది ఉన్నారు.
Next Story






